Skip to main content

AP Contract Lecturers: ఇక రెగ్యులర్... కాంట్రాక్ట్‌ లెక్చరర్ల జీవితాల్లో వెలుగులు!

చాలా కాలంగా, ఎంతోమంది లెక్చ‌ర‌ర్లు కాంట్రాక్ట్ లెక్చ‌రర్లుగా ప‌ని చేసారు. ఇక వారంద‌రినీ రెగ్యుల‌ర్ చేయాల‌ని డిమాండ్ చేయ‌గా, ఈ విష‌యాన్ని ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వ‌ద్ద‌కు చేరింది. దీంతో ఆయ‌న త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు..
Lecturers conveying their thanks to AP CM Jagan
Lecturers conveying their thanks to AP CM Jagan

సాక్షి ఎడ్యుకేష‌న్: రాష్ట్రంలో 2014 జూన్‌కు ముందు నుంచి పని చేస్తున్న కాంట్రాక్ట్‌ లెక్చరర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రెగ్యులర్‌ చేస్తూ తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. తమను రెగ్యులర్‌ చేయాలని కాంట్రాక్ట్‌ లెక్చర్ల డిమాండ్‌ చేస్తున్నా గత ప్రభుత్వం విస్మరించింది. ఈ విషయమై పలువురు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఏపీజీఈఓఫ్‌ చైర్మన్‌ కాకర్ల వెంకట్రామిరెడ్డిలు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

దీంతో సీఎం స్పందించి 2014 ముందు నుంచి సర్వీస్‌లో ఉన్న ప్రతి కాంట్రాక్టు లెక్చరర్‌ను రెగ్యులర్‌ చేసేందుకు ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సెప్టెంబర్‌ 20వ తేదీన రెగ్యులర్‌ చేస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకోవడం పట్ల జిల్లా కాంట్రాక్టు లెక్చరర్లంతా ఆనందం వ్యక్తం చేస్తూ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి సంబరాలు జరుపుకున్నారు. జీవితంలో ఎన్నటికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను మరిచిపోలేమని, సదా రుణపడి ఉంటామన్నారు.

సీఎం తీసుకున్న నిర్ణయం ద్వారా ప్రస్తుతం నంద్యాల జిల్లా ప్రభుత్వ కళాశాలలో 130 మంది, డిగ్రీ కళాశాలల్లో 27 మంది, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 25 మంది లెక్చరర్లకు లబ్ధి చేకూరనుంది. కాంట్రాక్టు లెక్చరర్ల తరపున కాంట్రాక్టు లెక్చరర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్ర మోహన్‌ రెడ్డి, నంద్యాల ఎంపీ పోచా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవి చంద్రకిశోర్‌రెడ్డి, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

మాట నిలబెట్టుకున్న సీఎం

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కాంట్రాక్టు ఉద్యోగుల విషయంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. దీంతో రాష్ట్రంలో వేలమంది కాంట్రాక్టు లెక్చరర్లు రెగ్యులర్‌ అయ్యారు. వారి జీవితాల్లో వెలుగులు నింపారు. మా కుటుంబాలు ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాయి.

  – నాగమురళీమోహన్‌,

జూనియర్‌ కాలేజీ లెక్చరర్‌, పాణ్యం

ఆనందంగా ఉంది

రెండు దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణకు గురైన కాంట్రాక్టు అధ్యాపకుల జీవితాల్లో ముఖ్యమంత్రి వెలుగులు నింపారు. ఎంతో మంది ప్రభుత్వ పెద్దలను కలిసి మా గోడు తెలిపినా ఫలితం లేకుండా పోయింది. సీఎం మా బాధను అర్థం చేసుకుని రెగ్యులర్‌ చేస్తూ నిర్ణయం తీసుకోవడం ఆనందంగా ఉంది. 
   – ఎం.రమేష్‌బాబు,
 

Published date : 25 Sep 2023 05:36PM

Photo Stories