Skip to main content

EMDP Program: 9వ తరగతి విద్యార్థులకు ఈఎండీపీ శిక్షణ

విద్యార్థి దశ నుంచే పారిశ్రామిక ఆలోచనలు కలగాలనే ఉద్దేశంతో ప్రభుత్వ పాఠశాలల్లో వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందుకోసం 9వ తరగతి విద్యార్థులతోనే ఈ ప్రక్రియను ప్రారంభించారు అధికారులు..
Entrepreneurial Mindset Development Programme for 9th class students

రాయవరం: విద్యార్థుల వినూత్న ఆలోచనలకు కార్యాచరణ తోడైతే మెరుగైన ఫలితాలు వస్తాయి. అందుకే విద్యార్థి దశ నుంచే పారిశ్రామిక ఆలోచనలు కల్పించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో ‘వ్యవస్థాపక మనస్తత్వ అభివృద్ధి’ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేసింది. పారిశ్రామిక, ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పిస్తోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎంటర్‌ప్రెన్యూరియల్‌ మైండ్‌సెట్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌ (ఈఎండీపీ)ను అమలు చేస్తున్నారు.

Technical Certificate Course: పరీక్షల్లో వసూళ్లు!.. పంపకాల్లో తేడా రావడంతో బట్టబయలు

ఈ నేపథ్యంలో విద్యార్థులు నేర్చుకున్న పారిశ్రామిక, ఆర్థిక అక్షరాస్యతపై వారికి ఏ మేరకు అవగాహన కలిగిందో తెలుసుకునేందుకు కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ప్రాజెక్టుల ఎక్స్‌పో నిర్వహిస్తున్నారు. శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు ఈఎండీపీ ఎక్స్‌పోను జిల్లా విద్యాశాకాధికారి ఎం.కమలకుమారి, సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్‌ ఎ.మధుసూదనరావు ప్రారంభిస్తారు.

TS Mega DSC 2024: 823 పోస్టులు ఖాళీ.. 4 నుంచి దరఖాస్తుల స్వీకరణ

జిల్లాలో 13,517 మంది విద్యార్థులు

జిల్లాలోని 224 ప్రభుత్వ జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న 13,517 మంది విద్యార్థులకు ఈ ఎండీపీ పాఠాలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం తొమ్మిదో తరగతి బోధన చేసే ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇచ్చారు. ఈ ఉపాధ్యాయులు ప్రతి శుక్రవారం విద్యార్థులకు తరగతులు నిర్వహించారు. ఆర్థిక అక్షరాస్యత బోధనలో భాగంగా బడ్జెట్‌, పొదుపు, ఖర్చు తదితర అంశాలపై చైతన్యం కలిగించారు.

Engineering Students: ప్లేస్మెంట్‌ ఉద్యోగాలు సాధించిన ఇంజనీరింగ్‌ విద్యార్థులు

సాంకేతికత, ఇతర ఉత్పత్తులను పరిచయం చేశారు. మొత్తం 18 అంశాల్లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. ఒక్కో విద్యార్థి ఐదేసి ప్రాజెక్టులను రూపొందించాలి. జిల్లాలోని వివిధ మండలాల పరిధిలో 87 పాఠశాలలకు చెందిన 487 ప్రాజెక్టులను ఆన్‌లైన్‌లో సబ్‌మిట్‌ చేశారు. వీటి నుంచి పది ఉత్తమ ప్రాజెక్టులను జిల్లాస్థాయి ఎక్స్‌పోకు ఎంపిక చేశారు.

జిల్లా కమిటీ ఏర్పాటు

జిల్లా విద్యాశాకాధికారి ఎం.కమల కుమారి పర్యవేక్షణలో జిల్లా సైన్స్‌ అధికారి ఆధ్వర్యంలో నిర్వహించే ఈఎండీపీ ఎక్స్‌పోలో విద్యార్థులు ప్రదర్శించే ప్రాజెక్టుల్లో రెండింటిని రాష్ట్ర స్థాయికి జిల్లా కమిటీ ఎంపిక చేయాల్సి ఉంది. ఇందుకోసం రామచంద్రపురం డీవైఈవో, జిల్లా సైన్స్‌ అధికారి, డీసీఈబీ కార్యదర్శి, బొమ్మూరు డైట్‌ లెక్చరర్‌ కేవీ సూర్యనారాయణ, ఈఎండీపీ జోనల్‌ మేనేజర్‌ వై.నవ్య, సమగ్ర శిక్షా ఏఎంవోతో కమిటీని ఏర్పాటు చేశారు.

Foreign Education: విదేశీ విద్యపై అవగాహన సదస్సు

ఎక్స్‌పోలో ప్రాజెక్టులు ప్రదర్శించనున్న పాఠశాలలు

● కపిలేశ్వరపురం మండలం కాలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ (ఆటోమేటిక్‌ డ్రైనేజ్‌ క్లీనర్‌)

● అమలాపురం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల (ఎమర్జెన్సీ నేప్‌కిన్‌ బాక్స్‌)

● ఆత్రేయపురం మండలం ఉచ్చిలి జెడ్పీ ఉన్నత పాఠశాల (లైఫ్‌ సేవర్‌ స్టిక్‌ ఫర్‌ స్నేక్‌ బైట్స్‌)

● ముమ్మిడివరం మండలం అనాతవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బోన్సాయ్‌ నర్సరీ ఫ్లాంట్‌)

● అమలాపురం మండలం పాలగుమ్మి జెడ్పీహెచ్‌ఎస్‌ (కోనసీమ టూర్స్‌ యాప్‌)

● అమలాపురం మండలం జనుపల్లి జెడ్పీ ఉన్నత పాఠశాల (ఫెర్టిలైజర్‌ బైయూజింగ్‌ ఎగ్‌సెల్‌)

● కొత్తపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల (బైండ్‌ గ్లాస్‌)

● మండపేట శ్రీ గౌతమి మున్సిపల్‌ ఉన్నత పాఠశాల (హోమ్‌ సర్వీస్‌ ఎక్స్‌ఫర్ట్‌)

● అంబాజీపేట మండలం జి.అగ్రహారం జెడ్పీ ఉన్నత పాఠశాల (రీసైక్లింగ్‌ ఆఫ్‌ టెండర్డ్‌ కోకోనట్‌)

● కపిలేశ్వరపురం మండలం టేకి జెడ్పీ ఉన్నత పాఠశాల (సాంబ్రాణి ఎరాడికేటింగ్‌ మస్కిటోస్‌).

Skill Hub: విద్యా‍ర్థులకు డిగ్రీతోపాటు ఉద్యోగం..

Published date : 01 Mar 2024 04:49PM

Photo Stories