Skip to main content

LAWCET: లాసెట్.. జైలు వార్డెన్ కుమారుడికి టాప్ ర్యాంక్...

న్యాయవాద కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన లాసెట్‌లో 68.84 శాతం మంది అర్హత సాధించారు.
LAWCET
లాసెట్.. జైలు వార్డెన్ కుమారుడికి టాప్ ర్యాంక్...

ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు వంద శాతం క్వాలిఫై అయ్యారు. మూడేళ్లు, ఐదేళ్లు, పీజీ లాసెట్‌ను ఉస్మానియా వర్సిటీ గత నెల 23, 24 తేదీల్లో నిర్వహించింది. ఫలితాలను తెలంగాణ‌ ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్‌ ఆర్‌. లింబాద్రి సెప్టెంబ‌ర్‌ 15న‌ విడుదల చేశారు. మొత్తం 39,805 మంది అభ్యర్థులు లాసెట్‌ కోసం రిజ్రిస్టేషన్ చేసుకోగా.. 29,629 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 20,398 (68.84 శాతం) అర్హత పొందారు. పురుషుల ఉత్తీర్ణత శాతం 70.67, మహిళల ఉత్తీర్ణత 64.42 శాతం ఉంది. ముగ్గురు ట్రా న్స్ జెండర్స్‌ లాసెట్‌లో అర్హత సాధించారు. మూడేళ్ల లాసెట్‌కు 21,160 మంది హాజరైతే 14,017 (66.24 శాతం) క్వాలిఫై అయ్యారు. ఐదేళ్ల లాసెట్‌కు 5,793 మంది హాజరైతే 3,846 (66.39 శాతం) అర్హత పొందారు. పీజీ లాసెట్‌కు 2,676 మంది హాజరైతే, 2,535 మంది (94.73 శాతం) అర్హత సాధించారు. ఈ కార్యక్రమంలో ఉస్మానియా వర్సిటీ వైఎస్‌ చాన్సలర్లు డి. రవీందర్, టి. వెంకటరమణ, లాసెట్‌ కన్వీనర్‌ జీబీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

జైలు వార్డెన్ కుమారుడికి టాప్‌ ర్యాంక్‌... 

చంచల్‌గూడకు చెందిన గణేష్‌ శస్త శరణ్‌ మూడేళ్ల లాసెట్‌లో రాష్ట్రస్థాయి మొదటి ర్యాంక్‌ సాధించాడు. వరంగల్‌ ఎన్ ఐటీలో ఎలక్ర్టికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన గణేష్‌ తండ్రి నాగరాజు చంచల్‌గూడ జైలు హెడ్‌వార్డెన్. క్యాంపస్‌లో అత్యధిక వేతనంతో అవకాశాలొచ్చినా... సివిల్స్‌ లక్ష్యంగా హైదరాబాద్‌లో కోచింగ్‌ తీసుకుంటున్నట్లు చెప్పాడు. మొదటి ర్యాంకు సాధించడంతో న్యాయవాద వృత్తిలో స్థిరపడాలన్న ఆకాంక్ష బలపడిందని గణేష్‌ తెలిపాడు.

లాసెట్ టాపర్స్...

మూడేళ్ల లాసెట్‌

పేరు

ప్రాంతం

గణేష్‌ శాస్త శరణ్‌

చంచల్‌గూడ, హైదరాబాద్‌

పర్వతనేని దివ్యశ్రీ

కరీంనగర్‌

అనంతుల రమేష్‌

కూకట్‌పల్లి, హైదరాబాద్‌

సంగం భరత్‌

బాలాపూర్, రంగారెడ్డి

మందలా శరత్‌చంద్ర

కరీంనగర్‌

ఐదేళ్ల లాసెట్‌

డి శ్రీధర్‌రెడ్డి

మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌

పవన్ భగత్‌

ఛత్తీస్‌గఢ్‌

దేవరకొండ మనోజ్ఞ

హైదరాబాద్‌

జాహెద్‌ ఉద్దీన్

షేక్‌పేట, హైదరాబాద్‌

గణేష్‌ నాయర్‌

హైదరాబాద్‌

పీజీ లాసెట్‌

దీక్ష బి

మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌

హరినాగ అభిజ్ఞ

మియాపూర్, హైదరాబాద్‌

గ్రంథి శ్రీకాంత్‌

సూర్యాపేట

జోబి నోబుల్‌

కేరళ

జాగృతి సంఘీ

హైదరాబాద్‌

చదవండి:
LAWCET: సెప్టెంబర్‌ 15న లాసెట్‌ ఫలితాలు… సాక్షి ఎడ్యుకేష‌న్‌లో ఫ‌లితాలు

‘లా’ .. యువత ఆకర్షణీయ కెరీర్

Published date : 16 Sep 2021 05:00PM

Photo Stories