SSB Recruitment 2023: సశస్త్ర సీమాబల్‌లో 1656 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల.. రాత పరీక్ష ఇలా..
- మొత్తం పోస్టుల సంఖ్య: 1656
- పోస్టుల వివరాలు: సబ్–ఇన్‌స్పెక్టర్ పోస్టులు–111 , అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (పారామెడికల్)–30, అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ (స్టెనోగ్రాఫర్)–40, హెడ్‌కానిస్టేబుల్ –914, కానిస్టేబుల్ పోస్టులు–543 తోపాటు అసిస్టెంట్ కమాండెంట్(వెటర్నరీ) 18 పోస్టులు ఉన్నాయి.
సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు–అర్హతలు
- సబ్ ఇన్‌స్పెక్టర్(పయనీర్): సివిల్ ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు 30 ఏళ్ల లోపు ఉండాలి.
- సబ్ ఇన్‌స్పెక్టర్(డ్రాఫ్ట్స్‌మెన్): మెట్రిక్యులేషన్/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. రెండేళ్ల ఐటీఐ నేషనల్ ట్రేడ్స్‌మెన్ సర్టిఫికేట్ ఉండాలి. ఆటోక్యాడ్‌లో ఏడాది సర్టిఫికేట్ కోర్సు పూర్తిచేయాలి లేదా ఆటో క్యాడ్‌లో ఏడాది అనుభవం ఉండాలి. డ్రాఫ్ట్స్‌మ్యాన్‌షిప్‌లో ఏడాది అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు. వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
- సబ్ ఇన్‌స్పెక్టర్(కమ్యూనికేషన్): ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో డిగ్రీ పూర్తిచేయాలి. గరిష్ట వయసు 30ఏళ్లు.
- సబ్ ఇన్‌స్పెక్టర్(స్టాఫ్‌నర్స్) ఫిమేల్: సైన్స్ సబ్జెక్టుతో 10+2/తత్సమాన పరీçక్షలో ఉత్తీర్ణులవ్వాలి. జనరల్ నర్సింగ్‌లో మూడేళ్ల డిప్లొమా పూర్తిచేయాలి. సెంట్రల్/స్టేట్ కౌన్సిల్‌లో తప్పనిసరిగా రిజిస్టరై ఉండాలి. రెండేళ్ల అనుభవం తప్పనిసరి. వయసు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.
- వయసు: ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, ఎక్స్–సర్వీస్‌మెన్‌లకు 3 ఏళ్లు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు 5 నుంచి 10 ఏళ్ల మినహాయింపు ఉంటుంది.
చదవండి: SSB Recruitment 2023: సశస్త్ర సీమా బల్‌లో 914 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు..
ఎంపిక విధానం
ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్(పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్(పీఎస్‌ఈ), రాత పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సబ్–ఇన్‌స్పెక్టర్(కమ్యూనికేషన్) పోస్టుకు మాత్రమే పీఈటీ నిర్వహిస్తారు. 1.6 కిలో మీటర్ల పరుగును పురుష అభ్యర్థులు 6 నిమిషాల 30 సెకన్లలో ముగించాలి. మహిళా అభ్యర్థులు 800 మీటర్ల రేసును 4 నిమిషాల్లో ముగించాలి. ఎక్స్–సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పీఈటీ లేదు. వీరు పీఎస్‌టీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్‌లకు హాజరుకావాలి.
రాత పరీక్ష ఇలా
పీఈటీ, పీఎస్‌టీ టెస్టులో అర్హత సాధించిన అభ్యర్థులను రాత పరీక్ష(కామన్ ఎంట్రెన్స్ టెస్ట్)కు ఎంపిక చేస్తారు. దీన్ని దేశవ్యాప్తంగా నిర్వహిస్తారు. రాత పరీక్ష రెండు పార్ట్‌లుగా 150 ప్రశ్నలకు ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు.
- పార్ట్–1: ఈ పార్ట్‌లో జనరల్ నాలెడ్జ్, మ్యాథమేటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్ /జనరల్ హిందీ 50 మార్కులకు ఉంటాయి.
- పార్ట్–2: ఈ పార్ట్‌లో టెక్నికల్ సబ్జెక్టుకు 100 మార్కులుంటాయి.
రాత పరీక్షకు సంబంధించి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులు 50 శాతం మార్కులు సాధించాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 45 శాతం మార్కులు పొందాలి. రాత పరీక్షలో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణలోకి తీసుకుంటారు.
చదవండి: Police Exams Study Material
తుది ఎంపిక
ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్టులను నిర్వహిస్తారు. పోస్టుల సంఖ్యకు మూడు రెట్ల మంది అభ్యర్థులను డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్‌కు పిలుస్తారు. రాత పరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక చేస్తారు.
ప్రిపరేషన్ ఇలా
తొలుత పరీక్ష విధానంపై అవగాహన పెంచుకోవాలి. దానికి అనుగుణంగా టైమ్ టేబుల్ ప్రిపేర్ చేసుకోవాలి. టెక్నికల్ సబ్జెక్టుకు 100 మార్కులు కేటాయించారు. కాబట్టి అభ్యర్థులు తాము ఐటీఐలో చదివిన టెక్నికల్ అంశాలపై పట్టు సాధించాలి. ప్రశ్నల సరళిని తెలుసుకునేందుకు గత ప్రశ్నపత్రాలను పరిశీలించాలి. అలాగే వీలైనన్నీ ఎక్కువ మాక్‌టెస్టులను రాయాలి. తద్వారా వేగం, టైమ్ మేనేజ్‌మెంట్ అలవడుతుంది.
హెడ్‌కానిస్టేబుల్ పోస్టులు
- అర్హతలు: పదో తరగతి, ఇంటర్మీడియట్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా ఉత్తీర్ణతతోపాటు పని అనుభవం ఉండాలి.
- వయసు: హెచ్‌సీ(మెకానిక్) పోస్టుకు 21–27 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 18–25 ఏళ్ల మధ్య ఉండాలి. గరిష్ట వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, ఎక్స్–సర్వీస్‌మెన్‌లకు 3 ఏళ్లు, డిపార్ట్‌మెంట్ అభ్యర్థులకు 40 నుంచి 45 ఏళ్ల వరకూ మినహాయింపు ఉంటుంది.
- ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
చదవండి: ఈవెంట్స్‌లో విజయం సాధించండిలా...
పోలీస్ కానిస్టేబుల్
- అర్హతలు: డ్రైవర్ పోస్టుకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పదోతరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణతతోపాటు హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. వయసు 21–27 ఏళ్ల మధ్య ఉండాలి. వెటర్నరీ పోస్టుకు సైన్స్ ప్రధాన సబ్జెక్టుగా పదోతరగతి/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. వెటర్నరీ హాస్పిటల్‌లో ఏడాది పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు 18–25 ఏళ్ల మధ్య ఉండాలి.
- కార్పెంటర్, బ్లాక్‌స్మిత్, పెయింటర్ పోస్టులకు పదోతరగతి/తత్సమాన ఉత్తీర్ణత ఉండాలి. రెండేళ్ల పని అనుభవం తప్పనిసరి. లేదా ఏడాది వ్యవధి ఉన్న ఐటీఐ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేయాలి. లేదా రెండేళ్ల ఐటీఐ డిప్లొమా ఉండాలి. ట్రేడ్ టెస్టులో తప్పనిసరిగా అర్హత సాధించాలి. వాషర్‌మ్యాన్, బార్బర్, సఫాయివాలా, టైలర్, గార్డెనర్, క్లోబర్, కుక్ అండ్ వాటర్ కేరియర్ పోస్టులకు టెన్త్/తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులవ్వాలి. రెండేళ్ల పని అనుభవం/ఐటీఐ ఏడాది సర్టిఫికేట్ కోర్సు చేసి ఉండాలి. లేదా రెండేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. ట్రేడ్ టెస్టులో తప్పనిసరిగా అర్హత సాధించాలి. మల్టీస్కిల్డ్ వ్యక్తులకు ప్రాధాన్యమిస్తారు.
ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
పీఈటీలో అర్హత సాధించిన అభ్యర్థులను పీఎస్‌టీకి ఎంపిక చేస్తారు. ఇందులోనూ అర్హత పొందిన వారికి కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(సీఈటీ) నిర్వహిస్తారు. వ్యవధి రెండు గంటలు. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు 100 మార్కులకు ఉంటాయి. జనరల్ నాలెడ్జ్, మ్యాథమెటిక్స్, రీజనింగ్, జనరల్ ఇంగ్లిష్/జనరల్ హిందీ విభాగాల నుంచి ప్రశ్నలు ఇస్తారు.
ముఖ్యసమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 18.06.2023
- వెబ్‌సైట్: http://ssbrectt.gov.in/
చదవండి: ITBP Recruitment 2023: ఐటీబీపీలో 81 హెడ్ కానిస్టేబుల్(మిడ్‌వైఫరీ) పోస్టులు.. ఎవరు అర్హులంటే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Qualification | 10TH |
Last Date | June 18,2023 |
Experience | Fresher job |
For more details, | Click here |