Skip to main content

Benefits of Taking MPC course in Inter : ఇంట‌ర్‌లో ఎంపీసీ కోర్సు తీసుకుంటే..ఉండే ఉప‌యోగాలు ఇవే..! ఎంపీసీ వైపే ఎక్కువ మంది.. ఎందుకంటే..?

ప్ర‌స్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఇంట‌ర్ ప్ర‌వేశాల ప్ర‌క్రియ జోరుగా జ‌రుగుతుంది. టెన్త్ పూరైన త‌ర్వాత ప్ర‌తి విదార్థి ఆలోచ‌న్‌.. పదో తరగతి తర్వాత ఏం చేయాలి..? ఇంట‌ర్‌లో ఏ కోర్సు తీసుకుంటే.. నా కెరీర్ బెస్ట్‌గా ఉంటుంది..? ఇలా మొద‌లైన అంశాల‌పై సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ (www.sakshieducation.com) ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల ద్వారా అందిస్తున్న ప్ర‌త్యేక స్టోరీ మీకోసం..
Inter MPC course Benefits  career options after 10th standard

ఇంట‌ర్‌లో ఎంపీసీ కోర్సు తీసుకుంటే..
ఇంట‌ర్‌లో.. ఎంపీసీ.. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల కలయికగా ఉండే గ్రూప్‌ ఇది. ఈ గ్రూప్‌తో ఈఏపీసెట్, జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, బిట్‌శ్యాట్‌ వంటి ప్రవేశ పరీక్షల్లో ర్యాంకు సాధించి ఇంజనీరింగ్‌లో కెరీర్‌కు బాటలు వేసుకోవచ్చు. ఎన్‌డీఏ, 10+2 టెక్నికల్‌ ఎంట్రీ స్కీంల ద్వారా డిఫెన్స్‌ రంగంలో కెరీర్‌ ప్రయత్నాలు చేయొచ్చు. వీటితోపాటు భవిష్యత్తులో సైన్స్‌ రంగంలో స్థిరపడాలనుకుంటే.. బీఎస్సీ, ఆ తర్వాత ఎమ్మెస్సీ, రీసెర్చ్‌ కోర్సులు చేసే అవకాశం కూడా ఉంది. 

☛ Best Polytechnic Courses: పాలిటెక్నిక్‌తో.. గ్యారెంటీగా జాబ్ వ‌చ్చే కోర్సులు చేరాలనుకుంటున్నారా..? అయితే ఈ స‌మాచారం మీకోస‌మే..

ఎంపీసీతో రాణించేందుకు కంప్యుటేషనల్‌ స్కిల్స్, న్యూమరికల్‌ స్కిల్స్‌ ఉండాలని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతోపాటు మన కళ్ల ముందు కనిపించే గ్యాడ్జెట్స్, వాటి పనితీరును తెలుసుకోవాలనే ఆసక్తి ఉండాలి. 

ఇంట‌ర్‌లో ఎంపీసీ వైపే ఎక్కువ మంది.. ఎందుకంటే..?

Benefits of Taking MPC course in Inter

పదో తరగతి ఉత్తీర్ణుల్లో ఎక్కువ మంది విద్యార్థులు ఎంపిక చేసుకుంటున్న గ్రూప్‌.. ఎంపీసీ(మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ). కారణం.. ఉపాధి అవకాశాలు మెండుగా కల్పించే ఇంజనీరింగ్‌ కోర్సుల్లో చేరేందుకు ఈ గ్రూప్‌ అర్హతగా ఉండటమే..! 

చ‌ద‌వండి: Best Career Options After 10th: పది తర్వాత.. కెరీర్‌ ప్లానింగ్‌!

ఎంపీసీలో చేరాలనుకునే విద్యార్థులకు సహజంగా కొన్ని లక్షణాలు ఉండాలి అంటున్నారు నిపుణులు. అవి.. కంప్యుటేషనల్‌ స్కిల్స్, న్యూమరికల్‌ స్కిల్స్‌. మన కళ్ల ముందు కనిపించే పరికరాలు, వాటి పనితీరు తెలుసుకునే ఆసక్తి, అకడమిక్‌గా ప్రయోగాల పట్ల ఇష్టమున్న వారు ఎంపీసీ గ్రూప్‌నకు సరితూగుతారు. అలాగే భవిష్యత్తులో సైన్స్‌ రంగంలో స్థిరపడాలనుకుంటే.. ఇంటర్‌ ఎంపీసీతో బీఎస్సీ, ఆ తర్వాత ఎమ్మెస్సీ, రీసెర్చ్‌ కోర్సులు చేస్తే.. అవకాశాలు పుష్కలం ఉంటాయి.

చదవండి: Best Courses After 10th: పదో తరగతి తర్వాత అందుబాటులో ఉన్న కోర్సులు, భవిష్యత్‌ అవకాశాలు ఇవే..

చ‌ద‌వండి: Best Courses After 12th BiPC: బైపీసీతో... క్రేజీ కోర్సులివే!

Published date : 22 May 2024 05:07PM

Photo Stories