Skip to main content

Sreeja Akula: టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్‌లో తెలంగాణ క్రీడాకారిణి నంబర్ వన్!

తెలంగాణకు చెందిన క్రీడాకారిణి ఆకుల శ్రీజ రెండుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచి, ఇప్పుడు భారత టేబుల్ టెన్నిస్ (టీటీ) మహిళల సింగిల్స్‌లో నంబర్ వన్ ర్యాంక్‌కు చేరుకుంది.
Sreeja Akula surpasses Manika as India No.1 TT player

ఏప్రిల్ 23న విడుదలైన అంతర్జాతీయ టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ (ఐటీటీఎఫ్) తాజా ర్యాంకింగ్స్‌లో శ్రీజ ఒక స్థానం మెరుగుపరచుకొని 38వ ర్యాంక్‌కు చేరుకుంది.  

➤ శ్రీజ 38వ ర్యాంక్‌కు చేరుకోవడంతో భారత నంబర్ వన్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణిగా అవతరించింది.
➤ ఇప్పటి వరకు నంబర్‌వ‌న్‌గా ఉన్న మనిక బత్రా రెండు స్థానాలు పడిపోయి 39వ ర్యాంక్‌కు చేరుకుంది.
➤ యశస్విని 99వ ర్యాంక్‌లో, అర్చన కామత్ 100వ ర్యాంక్‌లో ఉన్నారు.
➤ శ్రీజ ఈ ఏడాది రెండు డబ్ల్యూటీటీ టైటిల్స్‌ సాధించింది.
2022 కామన్వెల్త్ గేమ్స్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణ పతకం గెలుచుకుంది.

Wrestler Sakshi: ‘టైమ్‌’ టాప్‌–100 జాబితాలో రెజ్లర్‌ సాక్షి మలిక్‌

పురుషుల ర్యాంకింగ్స్:
➤ శరత్ కమల్ 37వ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
➤ సత్యన్ జ్ఞానశేఖరన్ 60వ స్థానంలో, మానవ్ ఠక్కర్ 61వ స్థానంలో, హర్మీత్ దేశాయ్ 64వ ర్యాంక్‌లో ఉన్నారు.
➤ హైదరాబాద్‌కు చెందిన సూరావజ్జుల స్నేహిత్ 147వ ర్యాంక్‌లో నిలిచాడు.

Published date : 25 Apr 2024 05:38PM

Photo Stories