Skip to main content

Chess Champions: భారతదేశానికి చెందిన చెస్ చిచ్చరపిడుగులు వీరే..

భారతదేశానికి చెందిన యువ చెస్ క్రీడాకారులు దివిత్ రెడ్డి, శర్వానికా ఎస్ అంతర్జాతీయ వేదికపై దేశం పరువు చాటుకున్నారు.
Winners crowned at World Rapid & Blitz Cadet Championship 2024

అల్బేనియాలో జరిగిన ప్రపంచ అండర్-8, అండర్-10 ర్యాపిడ్ & బ్లిట్జ్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో వీరు అద్భుత ప్రదర్శన కనబరిచారు.

దివిత్ రెడ్డి: తెలంగాణకు చెందిన 8 ఏళ్ల బాలుడు, అండర్-8 ర్యాపిడ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని (10/11) సాధించాడు. అదే విభాగంలో బ్లిట్జ్‌లో కాంస్య పతకాన్ని (8.5/11) కూడా గెలుచుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణ అండర్-7, అండర్-9 ఓపెన్ ఛాంపియన్‌గా ఉన్న దివిత్, భవిష్యత్తులో భారతదేశానికి గొప్ప గ్రాండ్‌మాస్టర్‌గా ఎదుగుతాడని అభిమానులు నమ్ముతున్నారు.

Dommaraju Gukesh: చదరంగానికి మన దేశం నుంచి వచ్చిన తెలుగు కుటుంబానికి చెందిన చిచ్చరపిడుగు ఇత‌నే!!

శర్వానికా: తమిళనాడుకు చెందిన 10 ఏళ్ల బాలిక, అండర్-10 ర్యాపిడ్ విభాగంలో బంగారు పతకాన్ని (9/11) సాధించింది. బ్లిట్జ్‌లో రజత పతకాన్ని (9/11) కూడా గెలుచుకుంది. ఇటీవల జరిగిన కామన్‌వెల్త్ క్రీడల (2023-24) అండర్-10 బాలికల విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన శర్వానికా, భారత మహిళా చెస్‌లో కొత్త చరిత్ర సృష్టించే అవకాశం ఉంది.

Trophies for the prize winners

ఈ టోర్నమెంట్‌లో 22 దేశాల నుండి 59 మంది క్రీడాకారులు అండర్-8 ఓపెన్ ర్యాపిడ్ విభాగంలో, 19 దేశాల నుండి 43 మంది క్రీడాకారులు అండర్-10 బాలికల ర్యాపిడ్ విభాగంలో పాల్గొన్నారు. అండర్-8 ఓపెన్ బ్లిట్జ్‌లో 22 దేశాల నుండి 51 మంది క్రీడాకారులు, అండర్-10 బాలికల బ్లిట్జ్ విభాగంలో 18 దేశాల నుండి 41 మంది క్రీడాకారులు పోటీపడ్డారు.

 

 

2024 ఏప్రిల్ 26 నుంచి 28 వరకు అల్బేనియాలోని గ్రాండ్ బ్లూ FAFA రిసార్ట్‌లో (డ్యూరెస్‌) ఈ పోటీలు జరిగాయి. ఈ పోటీలను ఫిడే, అల్బేనియా చెస్ ఫెడరేషన్ నిర్వహించాయి.

Chess Tournament: చెస్‌ టోర్నమెంట్‌ మహిళల విభాగంలో హంపికి రెండో స్థానం

Published date : 01 May 2024 12:57PM

Photo Stories