Skip to main content

Chess Tournament: చెస్‌ టోర్నమెంట్‌ మహిళల విభాగంలో హంపికి రెండో స్థానం

క్యాండిడేట్స్‌ టోర్నీ మహిళల విభాగంలో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి 7.5 పాయింట్లతో రెండో స్థానాన్ని దక్కించుకోగా, వైశాలి 7.5 పాయింట్లతో నాలుగో స్థానాన్ని సంపాదించింది.
Koneru Humpy finishes second in Womens candidate    Womens Candidates Tournament

8 మంది గ్రాండ్‌మాస్టర్ల మధ్య 14 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో చైనా ప్లేయర్‌ టాన్‌ జోంగి 9 పాయింట్లతో విజేతగా నిలిచింది. మహిళల వరల్డ్‌ చాంపియన్‌ జు వెన్‌జున్‌ (చైనా)తో ప్రపంచ టైటిల్‌ కోసం టాన్‌ జోంగి తలపడుతుంది. చివరిదైన 14వ రౌండ్‌లో హంపి 62 ఎత్తుల్లో టింగ్‌జి లెపై.. వైశాలి 45 ఎత్తుల్లో కాటరీనా లాగ్నోపై గెలుపొందారు.

ఈ టోర్నీలో హంపి 3 గేముల్లో నెగ్గి, 9 గేమ్‌లను ‘డ్రా’ చేసుకొని, 2 గేముల్లో ఓడిపోయింది. వైశాలి 6 గేముల్లో గెలిచి, 5 గేముల్లో ఓడిపోయి, 3 గేమ్‌లను ‘డ్రా’గా ముగించింది. హంపి, టింగ్‌జి లె, వైశాలి 7.5 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచినా మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్‌ను వర్గీకరించారు.  

Gukesh: చరిత్ర సృష్టించిన గుకేశ్‌.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..

Published date : 24 Apr 2024 10:35AM

Photo Stories