Skip to main content

World Best International Airport: ప్రపంచంలోనే బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ ఎక్కడందో తెలుసా?

World Best International Airport

ఖతార్‌ రాజధాని దోహాలోని హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ప్రపంచంలోనే అత్యుత్తమ విమానాశ్రయంగా నిలిచింది. లండన్‌కు చెందిన పరిశోధనా సంస్థ స్కైట్రాక్స్ ఇటీవల పరిశోధన నిర్వహించి విడుదల చేసిన ర్యాంకుల్లో దోహా హమద్ ఎయిర్‌పోర్ట్‌ 2024 సంవత్సరానికి గానూ ప్రపంచంలోనే బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌గా ఎంపికైంది. 

ప్రయాణికులు చెక్-ఇన్ విధానాలు, రాకపోకలు, షాపింగ్, భద్రత, ఇమ్మిగ్రేషన్, నిష్క్రమణ ప్రక్రియలు తదితర అంశాలపై 2023 ఆగస్టు నుంచి 2024 ఫిబ్రవరి మధ్య కాలంలో నిర్వహించిన సమగ్ర గ్లోబల్ సర్వే ఆధారంగా స్కైట్రాక్స్ ర్యాంకులు విడుదల చేసింది.  

బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్‌ లిస్ట్‌లో మన స్థానం ఎక్కడుందంటే..
జర్మనీలో ఏప్రిల్ 17న 2024 వరల్డ్ ఎయిర్‌పోర్ట్ అవార్డుల కార్యక్రమం జరిగింది. స్కైట్రాక్స్ ర్యాంకుల్లో దోహా హమద్ ఎయిర్‌పోర్ట్‌ మొదటి స్థానం సాధించగా సింగపూర్‌లోని చాంగి విమానాశ్రయం రెండో స్థానంలో నిలిచింది. దక్షిణ కొరియాలోని ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయం మూడో స్థానంలో నిలిచింది.

ఇక భారత్‌ విషయానికి వస్తే ఈ జాబితాలో మొదటి వంద విమానాశ్రయాలలో నాలుగు మాత్రమే భారత్‌కు చెందిన ఎయిర్‌పోర్టులు ఉన్నాయి. ఢిల్లీ ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం 36వ స్థానంలో ఉండగా, బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ 59, హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ 61, ముంబై ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ 95వ స్థానాలలో నిలిచాయి.

Published date : 19 Apr 2024 02:45PM

Photo Stories