Skip to main content

World Largest Airport: ప్రపంచంలోనే అతి పెద్ద విమానాశ్రయం నిర్మాణం.. దీని పేరు ఏమంటే..

ప్రపంచంలోనే అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రమాన్ని నిర్మించబోతున్నారని దుబాయ్ పాలకుడు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ తెలిపారు.
Dubai begins construction of World Largest Airport

ఈ విమానాశ్రయానికి అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం (Al Maktoum International Airport) అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్‌కు 35 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 2.9 లక్షల కోట్లు) ఖర్చవుతుందని అంచనా.

ఈ విమానాశ్రయం ఏడాదికి 260 మిలియన్ల మంది ప్రయాణీకులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఇందులో ఐదు సమాంతర రన్‌వేలు, 400 ఎయిర్‌క్రాఫ్ట్ గేట్లు ఉంటాయి. ప్రస్తుత దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం కంటే ఇది ఐదు రెట్లు పెద్దదిగా ఉంటుంది. రాబోయే సంవత్సరాల్లో దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోని అన్ని కార్యకలాపాలను ఈ కొత్త విమానాశ్రయానికి బదిలీ చేస్తారు.

 

 

ఎమిరేట్స్, ఫ్లైదుబాయ్ వంటి విమానయాన సంస్థలకు కేంద్రంగా ఉండనుంది.  దుబాయ్‌ను ప్రపంచంలోనే ప్రముఖ ఏవియేషన్ హబ్‌గా మరింత పటిష్టం చేస్తుంది.

India Military: ప్రపంచ సైనిక వ్యయంలో భారత్ నాల్గవ స్థానం.. టాప్ 10 దేశాలు ఇవే..

Published date : 29 Apr 2024 12:30PM

Photo Stories