Skip to main content

visitors Record: రికార్డ్‌.. ఈ దేశానికి ఒక్క నెలలో పెరిగిన‌ పర్యాటకుల తాకిడి..!

తూర్పు ఆసియా దేశమైన జపాన్‌కు విదేశీ పర్యాటకుల తాకిడి గణనీయంగా పెరిగింది.
Japan records best-ever monthly visitor numbers in March

గత మార్చి నెలలో 30 లక్షల మందికి పైగా విదేశీయులు జపాన్‌ను సందర్శించారని ఆ దేశ ప్రభుత్వ డేటా వెల్లడించింది. ఒక నెలలో ఇంత మంది పర్యాటకులు రావడం రికార్డు అని పేర్కొన్నారు.

జపాన్‌ను గత మార్చి నెలలో మొత్తం 30.8 లక్షల మంది సందర్శించారు. ఏడాది క్రితం ఇదే నెలలో నమోదైన పర్యాటకుల సంఖ్యతో పోలిస్తే 69.5 శాతం పెరుగుదల నమోదైంది. కరోనా మహమ్మారి ప్రపంచ పర్యాటకాన్ని దెబ్బతీసే ముందు 2019 మార్చితో పోల్చినప్పటికీ ఈ ఏడాది మార్చి నెలలో 11.6 శాతం పర్యాటకులు పెరిగారని జపాన్ నేషనల్ టూరిజం ఆర్గనైజేషన్ తెలిపింది.

సాధారణంగా పెరుగుతున్న పర్యాటక డిమాండ్‌తోపాటు స్ప్రింగ్ చెర్రీ బ్లూజమ్ సీజన్, ఈస్టర్ విరామం కూడా సందర్శకుల సంఖ్యను పెంచడంలో దోహదపడింది. జపాన్‌ను సందర్శించిన విదేశీ పర్యాటకులలో ఎక్కువ మంది భారత్‌, జర్మనీ, తైవాన్, యునైటెడ్ స్టేట్స్‌ దేశాలకు చెందినవారు కావడం గమనార్హం. కోవిడ్‌  పరిమితులు ఎత్తేసినప్పటి నుంచి జపాన్‌ పర్యాటకం అభివృద్ధి చెందుతోంది. సందర్శకుల సంఖ్యను పెంచడానికి ఆ దేశ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది.

World's Best Airports: ప్రపంచంలోనే బెస్ట్‌ ఎయిర్‌పోర్ట్ ఇదే.. టాప్ 100లో ఉన్న భారత్ ఎయిర్‌పోర్టులు ఇవే..

Published date : 19 Apr 2024 04:55PM

Photo Stories