Skip to main content

Lok Sabha Election 2024: ఎండల తీవ్రత నేపథ్యంలో పోలింగ్‌ సమయం పెంపు..

తెలంగాణలో ఎన్నికలు జరుగుతున్న 17 లోక్‌సభ స్థానాల్లో పోలింగ్‌ సమయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం పెంచింది.
Election Commission Increases Polling Time In Telangana In View Of Heat Wave

ఎండల తీవ్రత దృష్ట్యా పోలింగ్‌ సమయాన్ని పెంచాలంటూ పలు రాజకీయ పార్టీలు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు మే 1వ తేదీ జారీ చేసిన ఆదేశాల్లో వెల్లడించింది. 

ఒక గంట పాటు అదనపు సమయం ఇస్తున్నట్టు తెలిపింది. సవరించిన సమయం ప్రకారం.. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ జరుగుతుందని వివరించింది. రాష్ట్రంలోని 12 లోక్‌సభ స్థానాల పరిధిలో పూర్తిగా.. మిగతా 5 లోక్‌సభ సీట్ల పరిధిలోని కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో మాత్రమే ఈ సమయం పెంపు ఉంటుందని ప్రకటించింది.

పోలింగ్‌ సమయం పెరిగే ఎంపీ స్థానాలు ఇవే..
కరీంనగర్, నిజామాబాద్, జహీరాబాద్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెళ్ల, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ (ఎస్సీ), నల్లగొండ, భువనగిరి లోక్‌సభ స్థానాలు

 

Election Lessons & Activities: సాంఘిక శాస్త్ర పాఠ్యాంశాల్లో.. ఎన్నికల పాఠం

కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో సమయం పెంచిన స్థానాలివే..
➢ ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానంలోని ఖానాపూర్‌ (ఎస్టీ), ఆదిలాబాద్, బోథ్‌(ఎస్టీ), నిర్మల్, ముథోల్‌.
➢ పెద్దపల్లి లోక్‌సభ స్థానంలోని ధర్మపురి (ఎస్సీ), రామగుండం, పెద్దపల్లి.
➢ వరంగల్‌ లోక్‌సభ స్థానంలోని స్టేషన్‌ ఘన్‌పూర్‌ (ఎస్సీ), పాలకుర్తి, పరకాల, వరంగల్‌ వెస్ట్, వరంగల్‌ ఈస్ట్, వర్థన్నపేట్‌. 
➢ మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానంలోని డోర్నకల్‌ (ఎస్టీ), మహబూబాబాద్‌ (ఎస్టీ), నర్సంపేట్‌.
➢ ఖమ్మం లోక్‌సభ స్థానంలోని ఖమ్మం, పాలేరు, మధిర, వైరా (ఎస్టీ), సత్తుపల్లి (ఎస్సీ).

India First General Elections: ఎన్నికల ఆరంభం అదిరింది.. తొలి సాధారణ ఎన్నికల్లో ఎటు చూసినా సవాళ్లే!!

Published date : 02 May 2024 01:21PM

Photo Stories