Skip to main content

Exports of Rare Earth: అరుదైన ఖనిజాల ఎగుమతులను తగ్గిస్తున్న దేశం ఇదే..

గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే ఈ ఏప్రిల్‌లో 0.2% అరుదైన ఖనిజాల ఎగుమతులను చైనా తగ్గించింది.
Rare Earth Export Quantity in April 2023 and April 2024  Chinas exports of rare earths dip slightly in April   Comparison of Chinas Rare Earth Exports

ప్రపంచంలోనే అత్యధిక ముడి ఖనిజాల ఉత్పత్తిదారుగా ఉన్న చైనా దాదాపు 17 రకాల అరుదైన ఖనిజాలను ఎగుమతి చేస్తుంది. 2024 ఏప్రిల్‌లో చైనా 4,566 టన్నుల అరుదైన ఖనిజాలను ఎగుమతి చేసింది. ఇది 2023 ఏప్రిల్‌లో 4,574 టన్నుల కంటే తక్కువ.

➤ మొత్తంమీద, 2024 మొదటి నాలుగు నెలల్లో చైనా 18,049.5 టన్నుల అరుదైన ఖనిజాలను ఎగుమతి చేసింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 10% పెరుగుదల.

➤ అదే సమయంలో, చైనా దిగుమతి చేసుకున్న అరుదైన ఖనిజాలు 2024 ఏప్రిల్‌లో 32.5% తగ్గి 13,145.9 టన్నులకు చేరుకున్నాయి.

Ecommerce Market: 325 బిలియన్ డాల‌ర్ల‌కు చేరుకోనున్న భారత ఈ-కామర్స్ మార్కెట్.. ఎప్ప‌టిలోపు అంటే..

➤ యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే ప్రకారం, చైనా ప్రపంచవ్యాప్తంగా 70% అరుదైన ఖనిజాలను కలిగి ఉంది. అలాగే 90% మైనింగ్, రిఫైనింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది.

➤ చైనా ఎగుమతి చేసే అరుదైన ఖనిజాలను లేజర్‌లు, సైనిక పరికరాలు, ఎలక్ట్రిక్ వాహనాలు, గాలి టర్బైన్‌లు, ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు.

➤ చైనా అరుదైన ఖనిజాల ఎగుమతులను తగ్గించడం వల్ల ఈ వస్తువుల ధరలు సమీప భవిష్యత్తులో పెరగవచ్చని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.

➤ నిపుణులు భారతదేశం తన స్వంత ఖనిజ వనరులను అన్వేషించడానికి, వాటిని వెలికితీయడానికి ప్రయత్నించాలని సూచిస్తున్నారు. 

 

GST Hit Record: జీఎస్‌టీ రికార్డు వసూళ్లు.. ఇప్పటి వరకూ ఇదే టాప్‌..

Published date : 10 May 2024 10:38AM

Photo Stories