Jobs: ఉద్యోగాల కల్పనలో ఈ కంపెనీలదే హవా.. టాప్–10 కంపెనీలివే..
అమెరికా రిటైల్ స్టోర్ దిగ్గజ సంస్థ వాల్‌మార్ట్, అమెజాన్, యునైటెడ్ పార్సిల్ సర్వీసెస్, కొరేగర్, హోమ్ డిపో సంçస్థలు అత్యధిక మందికి ఉద్యోగాలు కల్పించడం ద్వారా టాప్–10లో చోటు దక్కించుకున్నాయి. వాల్‌మార్ట్ కంపెనీ ఒకటే ఏకంగా 23 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా మొదటి స్థానంలో ఉన్నట్టు వరల్డ్ స్టాటస్టిక్స్ ఓఆర్‌జీ సంస్థ తాజాగా విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడించింది. 15.41 లక్షల మందికి ఉపాధి కల్పించడం ద్వారా ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థ అమెజాన్ రెండో స్థానంలో, తైవాన్‌కు చెందిన ఫాక్స్ కాన్ 8,26,608 మందికి ఉద్యోగాలు కల్పించడం ద్వారా మూడో స్థానంలో నిలిచాయి.
ఉద్యోగాల కల్పనలో టాప్–10 కంపెనీలివే..
చదవండి: TIFR Recruitment 2023: టీఐఎఫ్‌ఆర్, ముంబైలో వివిధ పోస్టులు.. నెలకు రూ.89,900 వరకు జీతం..
6వ స్థానంలో టీసీఎస్
టాప్–10లో ఇండియాకు చెందిన టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఒక్కటే చోటు దక్కించుకుంది. టీసీఎస్ 6,16,171 మందికి ఉపాధి కల్పించడం ద్వారా 6వ స్థానంలో నిలిచింది. దేశంలో అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తూ టాప్–100లో చోటు దక్కించుకున్న మరో మూడు భారతీయ కంపెనీలు ఉన్నాయి. ఇన్ఫోసిస్ 3,46,845 ఉద్యోగాల కల్పనతో 34వ స్థానంలో నిలవగా.. 2.60 లక్షల ఉద్యోగాల కల్పనతో మహీంద్రా 61వ స్థానం, 2.36 లక్షల ఉద్యోగాలిచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్ 74వ స్థానంలో నిలిచాయి.