Skip to main content

TSMJBC: ‘ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయాలి’

TSMJBC

కరీంనగర్‌: గంగాధరలోని మహాత్మజ్యోతిరావుపూలే బీసీ గురుకుల బాలుర పాఠశాలలో మంత్రి కేటీఆర్‌ జన్మదినం సందర్భంగా హ్యపీ బర్త్‌డే కేటీఆర్‌ అని విద్యార్థులను కింద కూర్చోబెట్టి ప్రదర్శన చేసిన ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా కార్యదర్శి మచ్చ రమేశ్‌ డిమాండ్‌ చేశారు. స్థానిక బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో జరిగిన నగర ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గంగాధరలో బీఆర్‌ఎస్‌ నేతల అత్యుత్సాహంతో విద్యార్థులు ఇబ్బంది పడ్డారని అన్నారు. విద్యార్థుల హక్కులను భంగం కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదని దీనిపై పై ఏఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో బాలల సంఘానికి, మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని అన్నారు. ఇందుకు కారణమైన పాఠశాల ప్రిన్సిపాల్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఏఐఎస్‌ఎఫ్‌ నగర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నునవత్‌ శ్రీనివాస్‌, నాయకులు కసిరెడ్డి సందీప్‌ రెడ్డి, అడప సాయికృష్ణ, వినయ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Govt Jobs: జూనియర్‌ కాలేజీల్లో 73 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.. చివరి తేదీ..


శాతవాహన విద్యార్థినికి యంగ్‌ మేనేజర్‌ అవార్డు
కరీంనగర్‌ సిటీ: కరీంనగర్‌లోని శాతవాహన యూనివర్సిటీ ఎంబీఏ మొదటి సంవత్సరం విద్యార్థిని గోనె ధనలక్ష్మి యంగ్‌ మేనేజర్‌ అవార్డు అందుకున్నారు. వరంగల్‌లోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కాలేజీలో ఈనెల 22వ తేదీన నిర్వహించిన మంత్ర–2023 కార్యక్రమంలో శాతవాహన యూనివర్సిటీ కాలేజీ అఫ్‌ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో ఏంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న గోనే ధనలక్ష్మి యంగ్‌ మేనేజర్‌ అవార్డు, రూ.5వేల నగదు రివార్డుతో పాటు హెచ్‌ఆర్‌ ఈవెంట్‌ విజేతగా నిలిచారు. ధనలక్ష్మిని మంగళవారం శాతవాహన యూనివర్సిటీ కాలేజీ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ హరికాంత్‌, అధ్యాపక బృందం ప్రత్యేకంగా అభినందించారు. బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ విభాగాధిపతి డాక్టర్‌ మనోహర్‌, అధ్యాపకులు ఎన్‌వీ.శ్రీరంగప్రసాద్‌, టి.కృష్ణకుమార్‌, మనోజ్‌ కుమార్‌, బి.అనూష, భరత్‌, కంచు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Tenth & Inter Results: ఓపెన్‌ స్కూల్‌ ఫలితాలు విడుదల

పీఆర్సీని వెంటనే ప్రకటించాలి
కరీంనగర్‌: పీఆర్‌సీని వెంటనే ప్రకటించాలని పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు పాతూరి రాజిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం సంఘ కార్యాలయంలో మాట్లాడుతూ పీఆర్సీ కమిటీని వెంటనే వేసి ఐఆర్‌ ప్రకటించాలని కోరారు. జిల్లాలోని ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులు ఇవ్వాలని, 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్‌ వర్తింపజేయాలని అన్నారు. కొత్త టైంటేబుల్‌ను ప్రైవేట్‌ పాఠశాలలు కూడా పాటించేలా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పీఆర్టీయూ జిల్లా అధ్యక్షులు గోనె శ్రీనివాస్‌, ప్రధాన కార్యదర్శి పల్లెపాటి వేణుగోపాల్‌ రావు, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు కేతిరి తిరుపతిరెడ్డి, రాంరెడ్డి, అశ్ఫాక్‌హుస్సేన్‌, వేణుగోపాలచారి తదితరులు పాల్గొన్నారు.

Published date : 26 Jul 2023 02:59PM

Photo Stories