Skip to main content

Group I Exam: గ్రూప్‌ –1 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి

నిర్మల్‌ చైన్‌ గేట్‌: గ్రూప్‌ –1 పరీక్ష అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ మహేందర్‌రెడ్డి అధికారులకు సూచించారు.
Group I Exam arrengements

హైదరాబాద్‌ నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నత అధికారులతో గ్రూప్‌–1 పరీక్ష నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ మాస్‌ కాపీయింగ్‌, లీకేజీలకు తావులేకుండా పరీక్ష నిర్వహించాలన్నారు.

జిల్లాలో పరీక్ష కేంద్రాల ఎంపిక పూర్తిచేసి, నిర్వహణ బాధ్యతలు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లకు అప్పగించాలని సూచించారు.

సంబంధిత అధికారులు పరీక్ష కేంద్రాలను సందర్శించి ఫర్నిచర్‌, సీసీ కెమెరాలు, తాగునీరు, విద్యుత్‌ సౌకర్యాలను తనిఖీ చేయాలన్నారు. పరీక్ష కేంద్రం సమీపంలో జిరాక్స్‌ సెంటర్లు మూసివేయాలని, కేంద్రాలకు మూడు కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్‌ విధించాలన్నారు.

పరీక్ష కేంద్రాలకు ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్‌ పత్రాల తరలింపు సమయంలో పోలీసు శాఖ పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు.

చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ |  సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ప్రతీ పరీక్ష కేంద్రంలో పోలీసు భద్రతను కల్పించాలని, పరీక్ష కేంద్రాల్లోకి సిబ్బంది, అభ్యర్థులు మొబైల్‌ ఫోన్‌, ఏ ఇతర ఎలక్టాన్రికి వస్తువులు తీసుకురాకుండా చూడాలి వివరించారు.

అభ్యర్థులు సకాలంలో కేంద్రాలకు చేరుకునేలా ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని తెలిపారు. కేంద్రాల వద్ద అత్యవసర వైద్య సిబ్బంది, మందులు, ఓఆర్‌ఎస్‌ పాకెట్లు అందుబాటులో ఉంచాలన్నారు.

పరీక్ష నిర్వహణలో లోపాలు తలెత్తకుండా అధికారులు సమన్వయంతో పనిచేసి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ మాట్లాడుతూ జూన్‌ 9న నిర్వహించే గ్రూప్‌–1 పరీక్షకు జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.

జిల్లాలోని 13 పరీక్షా కేంద్రాల్లో 4,608 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నట్లు పేర్కొన్నారు. కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పటు చేయడంతోపాటు పటిష్ట బందోబస్తు నిర్వహిస్తామన్నారు.

ప్రశాంత వాతావరణంలో పరీక్ష నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌, రూట్‌ ఆఫిసర్లను నియమిస్తామని పేర్కొన్నారు. అభ్యర్థుల సందేహాల నివృత్తికి కలెక్టర్‌ కార్యాలయంలో హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు టోల్‌ ఫ్రీ నంబర్‌ 6305646600లో సంప్రదించాలని తెలిపారు.

ఈ సమావేశంలో రీజినల్‌ కోఆర్డినేటర్‌ పి.గంగారెడ్డి, డీఈవో రవీందర్‌రెడ్డి, డీఎంహెచ్‌వో ధనరాజ్‌, ఆర్టీసీ డీఎం ప్రతిమారెడ్డి, డీపీఆర్వో విష్ణువర్ధన్‌, కలెక్టరేట్‌ ఏవో సూర్యరావు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Published date : 21 May 2024 11:27AM

Photo Stories