BRAOU: అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు గడువు పొడిగింపు
Sakshi Education
ఒంగోలు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీ ఒంగోలు స్టడీ సెంటర్ బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు అక్టోబర్ 20వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు రీజినల్ కో ఆర్డినేటర్ ఎం.శ్రీనివాసులు అక్టోబర్ 14న ఒక ప్రకటనలో తెలిపారు.
అంబేడ్కర్ విశ్వవిద్యాలయంలో ప్రవేశాలకు గడువు పొడిగింపు
ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్ ద్వారా ఇంటర్ ఒకేషనల్ కోర్సు, ఓపెన్ స్కూల్ ద్వారా ఇంటర్ పాసైన వారు కూడా డిగ్రీలో చేరేందుకు అర్హులని తెలిపారు. డిగ్రీ పూర్తిచేసేందుకు 1991 నుంచి 2011 వరకు డిగ్రీలో చేరి మధ్యలో ఆపిన వారికి కూడా యూనివర్శిటీ అవకాశం కల్పించిందన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, పూర్తి వివరాలకు స్టడీసెంటర్‌లోగానీ, 73829 29613 సెల్ నంబర్‌నుగానీ సంప్రదించాలని సూచించారు.