Skip to main content

Navodaya Exam: ఒక్కసారి ఎంటర్‌ అయితే చాలు... ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఫ్రీ

కొంచెం కష్టపడి ఎంట్రన్స్‌ పరీక్ష రాస్తే చాలు. ఒక్కసారి ఎంపికైతే ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఫుడ్, బెడ్, చదువు అన్నీ ఫ్రీనే. అదే నవోదయ ఎగ్జామ్‌.
Students

కానీ, చాలామంది తల్లిదండ్రులకు ఈ పరీక్షపై అవగాహన లేకపోవడంతో గోల్డెన్‌ చాన్స్‌ మిస్‌ చేసుకుంటున్నారు. అలాంటి వారి కోసమే ఈ కథనం...
దేశంలో మొత్తం 649 నవోదయ విద్యాలయాలున్నాయి. ఏపీలో 15, తెలంగాణలో 9 ఉన్నాయి. ఒక్కో విద్యాలయంలో గరిష్టంగా 80 మంది విద్యార్థులకు ఆరో తరగతిలో ప్రవేశం లభిస్తుంది. 2022–2023 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న వాళ్లు జవహర్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్ట్‌ (జేఎన్‌వీఎస్‌టీ) రాసుకోవచ్చు.

చ‌ద‌వండి: న‌వోద‌య ఎగ్జామ్ వివ‌రాలు.. ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ కోసం క్లిక్ చేయండి
విద్యార్థులు ఏ జిల్లాలో అడ్మిషన్‌కావాలి అనుకుంటారో అదే జిల్లాలో చదువుతూ ఉండాలి. విద్యార్థులు ఒకసారి మాత్రమే పరీక్ష రాయడానికి అర్హులు. 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంతాలవారికి కేటాయిస్తారు. ఈ కోటాలో సీటు ఆశించే విద్యార్థులు 3,4,5 తరగతులను పూర్తిగా గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో లేదా గుర్తింపు పొందిన ఇతర పాఠశాలల్లో చదవాలి. అలాగే మొత్తం సీట్లలో మూడో వంతు బాలికలకు కేటాయిస్తారు. ఎస్సీలకు 15, ఎస్టీలకు 7.5, ఓబీసీలకు 27 శాతం, దివ్యాంగులకు కొన్ని సీట్లు రిజర్వేషన్ల ప్రకారం కేటాయిస్తారు. 

చ‌ద‌వండి: ఈ టిప్స్ పాటిస్తే... నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో విజయం మీదే
100 మార్కులకు పరీక్ష....
ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో వస్తాయి. తెలుగు, హిందీ, ఇంగ్లిష్‌.. ఇలా కోరుకున్న మాధ్యమంలో పరీక్ష రాసుకోవచ్చు. మొత్తం 100 మార్కులకు నిర్వహిస్తారు. మూడు సెక్షన్ల నుంచి 80 ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలు ఉంటాయి. వీటిని 2 గంటల్లో పూర్తిచేయాలి. ఒక్కో ప్రశ్నకు 1.25 మార్కులు. నెగటివ్‌ మార్కులు లేవు. సెక్షన్‌ 1 మెంటల్‌ ఎబిలిటీ 40 ప్రశ్నలు. వీటిని గంటలో పూర్తి చేయాలి. సెక్షన్‌  2 అరిథ్‌మెటిక్‌ 20 ప్రశ్నలు. వీటికి అర గంటలో పూర్తి చేయాల్సి ఉంటుంది. సెక్షన్‌ 3 లాంగ్వేజ్‌ టెస్ట్‌ 20 ప్రశ్నలకు ఉంటుంది. దీన్ని 30 నిమిషాల్లో పూర్తి చేయాలి. ఎగ్జామ్‌లో సెలెక్ట్‌ కావడానికి ప్రతీ సెక్షన్‌ లోనూ కనీస మార్కులు సాధించాలి.

చ‌ద‌వండి:​​​​​​​ న‌వోదయ తొమ్మిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాలకు సంబంధించిన వివ‌రాల‌కు క్లిక్ చేయండి
పూర్తిగా ఉచితం....
బాలికలు, ఎస్సీ, ఎస్టీలు, అల్పాదాయ వర్గాలవారు ఆరో తరగతి నుంచి ఇంటర్‌ వరకు ఉచితంగా చదువుతోపాటు వసతి, భోజనం పొందవచ్చు. మిగిలినవారు తొమ్మిదో తరగతి నుంచి నెలకు రూ.600 చెల్లిస్తే సరిపోతుంది. సీబీఎస్‌ఈ సిలబస్‌ ఉంటుంది. నీట్, ఐఐటీ  జేఈఈ.. తదితర జాతీయ స్థాయి పరీక్షల్లో రాణించేలా శిక్షణ అందిస్తారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు పై తరగతులను ఇతర రాష్ట్రాల్లోని నవోదయ విద్యాలయాల్లోనూ చదువుకోవచ్చు.

చ‌ద‌వండి: రెండు, మూడు రోజుల్లో గ్రూప్‌1 ప్రిలిమినరీ ఫలితాలు..?​​​​​​​
ఈ నెలాఖరే చివరి తేదీ....
నవోదయ ఎంట్రన్స్‌ పరీక్షకు జనవరి 31వ తేదీ చివరి తేదీ. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 2022–23 అకడమిక్‌ ఇయర్‌లో 5వ తరగతి చదువుతూ ఉండాలి. గతంలో పూర్తిచేసుకున్నవారు అనర్హులు. మే 1, 2011 నుంచి ఏప్రిల్‌ 30, 2013 మధ్య జన్మించి ఉండాలి. పరీక్ష ఏప్రిల్‌ 29న నిర్వహిస్తారు. మరిన్ని వివరాలను ‘‘నవోదయ.జీఓవీ.ఇన్‌’’ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

Published date : 10 Jan 2023 03:22PM

Photo Stories