Skip to main content

Civil Engineering: సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యలో ఉపాధికి ఢోకా లేదు

రాయలసీమ విశ్వావిద్యాలయ ఇంజినీరింగ్‌ కళాశాలలో జరిగిన అవగాహన కార్యక్రమంలో డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ముఖ్య అతిథిగా హజరయ్యి విద్యార్థులతో సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ..
Krishna Naik is donating Rs.50 thousand to VC of Rayalaseema University

కర్నూలు కల్చరల్‌: సివిల్‌ ఇంజనీరింగ్‌కు మంచి భవిష్యత్తు ఉందని రహదారులు, భవనాల శాఖ విజయవాడ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎన్‌.కృష్ణానాయక్‌ అన్నారు. గురువారం రాయలసీమ విశ్వవిద్యాలయ ఇంజినీరింగ్‌ కళాశాల ఆడిటోరియంలో సివిల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థులకు జరిగిన అవగాహన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రహదారుల విస్తరణ, గృహ నిర్మాణం, వంతెనలు, ఆనకట్టల నిర్మాణాలను విస్తృతంగా చేపడుతున్న నేపథ్యంలో సివిల్‌ ఇంజినీరింగ్‌ విద్యార్థుల ఉపాధికి ఢోకా లేదన్నారు.

High School Plus: హైస్కూల్‌ ప్లస్‌లో జూన్‌ 1 నుంచి తరగతులు ప్రారంభం

రహదారులు, భవనాల శాఖ అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ వై.శశిభూషణ్‌ మాట్లాడుతూ.. విద్యార్థులు పాఠ్యాంశాలకే పరిమితం కాకుండా సివిల్‌ ఇంజినీరింగ్‌లో జరుగుతున్న నూతన ఆవిష్కరణలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. వర్సిటీలో నీటి కొరతను అధిగమించడానికి రహదారులు భవనాల శాఖ విజయవాడ డివిజన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ ఎన్‌.కృష్ణా నాయక్‌ గురువారం రూ.50 వేలను వైస్‌ చాన్స్‌లర్‌ ఆచార్య బి.సుధీర్‌ ప్రేమ్‌ కుమార్‌కు విరాళంగా అందించారు.

Free education in private schools: పేద విద్యార్థులకు ప్రైవేట్‌ స్కూల్స్‌లో ఉచిత విద్య

కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వై.హరిప్రసాద రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఈసీఈ విభాగాధిపతి జి.వినోద్‌కుమార్‌, ఇంజనీరింగ్‌ కళాశాల ట్రైనింగ్‌ అండ్‌ ప్లేస్‌మెంట్‌ అధికారి ఫరీదా, వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య నాగుల అంకన్న తదితరులు పాల్గొన్నారు.

National Apprentice Mela: 11న నేషనల్‌ అప్రెంటీస్‌ మేళా.. 205 పోస్టులు..

Published date : 09 Mar 2024 05:24PM

Photo Stories