Skip to main content

APPSC Group 1 & 2 Jobs Notification 2023 : ఈలోపే గ్రూప్-1 & 2 పోస్టుల‌కు నోటిఫికేష‌న్‌.. అలాగే ఈ ఉద్యోగాల‌కు కూడా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ (APPSC) గ్రూప్‌-1 తుది ఫ‌లితాల‌ను ఆగ‌స్టు 17వ తేదీన (గురువారం) ప్ర‌క‌టించిన విష‌యం తెల్సిందే.
appsc chairman gowtham sawang latest news telugu, appsc group 2 notification
appsc chairman gowtham sawang press meeting

ఈ సంద‌ర్భంగా విజయవాడలో APPSC బోర్డు చైర్మన్‌ గౌతం సవాంగ్ మాట్లాడుతూ.. ఈ సెప్టెంబ‌ర్‌లోపు గ్రూప్‌-2 నోటిఫికేష‌న్ విడుద‌ల చేస్తామ‌న్నారు. అలాగే ఈ సారి గ్రూప్‌-2 సిల‌బ‌స్‌లో మార్పులు చేస్తామ‌ని APPSC చైర్మన్‌ తెలిపారు.

ఏపీపీఎస్సీ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌ను కూడా భ‌ర్తీ చేస్తామ‌న్నారు. 17 ఏళ్ల త‌ర్వాత ఈ అసిస్టెంట్ ప్రొఫెస‌ర్ పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌బోతున్నామ‌న్నారు. అలాగే సెప్టెంబ‌ర్‌లోపు మ‌రో గ్రూప్‌-1 నోటిఫికేష‌న్ ఇస్తామ‌న్నారు. గ్రూప్ -2 కి వెయ్యి పోస్టులతో నోటిఫికేషన్ ఉండొచ్చని, అలాగే.. గ్రూప్-1 వంద పైనా పోస్టులతో నోటిఫికేషన్ ఉండొచ్చని తెలిపారాయన. యూపీఎస్సీ విధానంలో ఏపీపీఎస్సీ నియామక ప్రక్రియ ఉంటుందన్నారు. మొత్తం 1,199 ఉద్యోగాల భర్తీని చేపడతామని చెప్పారు.

గ్రూప్‌-1 ఫ‌లితాలు ఇలా.. టాప్‌-1లో ఆరుగురు.. 
111 పోస్టులకి 110 పోస్టుల ఫలితాలు ప్రకటిస్తున్నాం. స్పోర్ట్స్ కోటాలో మరో పోస్టు ఎంపిక జరుగుతుంది. 1:2 కోటాలో ఇంటర్వ్యూలకి అభ్యర్ధులని ఎంపిక చేశాం. 11 నెలల రికార్డు సమయంలో గ్రూప్ వన్ ఎంపిక ప్రక్రియ పూర్తి చేశాం. ఏపీపీఎస్సీ చరిత్రలోనే తొలిసారిగా ఇంత తక్కువ సమయంలో ఎంపిక ప్రక్రియ పూర్తి కావడం ఇదే. ముగ్గురు ఐఐఎం, 15 మంది ఐఐటీ అభ్యర్ధులు ఇంటర్వ్యూలకి వచ్చిన వాళ్లలో ఉన్నారు. ఎంపికైన వారిలో మొదటి పది స్ధానాలలో ఆరుగురు మహిళా అభ్యర్ధులే ఉన్నారు. టాప్ ఫైవ్ లో తొలి మూడు ర్యాంకర్లు మహిళలదే అని గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. 

చదవండి: ఏపీపీఎస్సీ Group 1& 2 : స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | గైడెన్స్ | ప్రీవియస్ పేపర్స్ | సక్సెస్ స్టోరీస్ | సిలబస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఆన్‌లైన్ క్లాస్ | ఎఫ్‌ఏక్యూస్‌ | టీఎస్‌పీఎస్సీ

ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 ర్యాంకర్ల వివరాలు ఇవే..
1 ఫస్ట్ ర్యాంకర్- భానుశ్రీ లక్ష్మీ అన్నపూర్ణ ప్రత్యూష ( బిఎ ఎకనామిక్స్ ఢిల్లీ యూనివర్సిటీ)
2. సెకండ్ ర్యాంకర్ - భూమిరెడ్డి భవాని ( అనంతపురం)
3.మూడవ ర్యాంకర్ - కంబాలకుంట లక్ష్మీ ప్రసన్న 
4. నాలుగవ ర్యాంకర్ - కె.ప్రవీణ్ కుమార్ రెడ్డి ( అనంతపురం జెఎన్ టియు)
5.అయిదవ ర్యాంకర్ - భానుప్రకాష్ రెడ్డి ( కృష్ణా యూనివర్సిటీ)

ఇవి నమ్మొద్దు..
ఏపీపీఎస్సీ నిర్వహించబోయే పరీక్షల విషయంలో.. సోషల్‌ మీడియాలో రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. ఈ పుకార్లపైనా చైర్మన్‌ గౌతమ్‌ సవాంత్‌ స్పందించారు. ‘‘సోషల్ మీడియాలో వచ్చే పుకార్లు నమ్మొద్దన్నారు. 

గ్రూప్‌-1 ప్రక్రియ సాగిందిలా..

appsc groups exam details 2023

గత ఏడాది సెప్టెంబర్ 30 న 111 పోస్టులకి నోటిఫికేషన్ విడుదలకాగా.. జనవరి 8 న ప్రిలిమ్స్ నిర్వహించింది ఏపీపీఎస్సీ. కేవలం 19 రోజులలో అంటే.. జనవరి 27 న ప్రిలిమ్స్ ఫలితాలు వెల్లడించారు. ప్రిలిమ్స్ కి 86 వేల మంది హాజరు కాగా.. 6, 455 మంది మెయి‌న్స్ కి అర్హత సాధించారు. జూన్‌ 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు మెయిన్‌ పరీక్ష నిర్వహించారు. 111 పోస్టులకిగానూ 220 మంది అర్హత సాధించారు. ఇక.. ఆగస్ట్ 2వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఇంటర్వ్యూలు నిర్వహించింది ఏపీపీఎస్సీ. 

Also read: APPSC Group 2 Notification 2023 : గ్రూప్‌–2 జాబ్ కొట్టే మార్గాలు ఇవే.. పరీక్ష విధానం, సిలబస్‌, ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

చ‌ద‌వండి: Groups Preparation Tips: గ్రూప్స్‌..ఒకే ప్రిపరేషన్‌తో కామన్‌గా జాబ్‌ కొట్టేలా!

APPSC Group 2 New Syllabus 2023 Details : ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 కొత్త‌ సిల‌బ‌స్ ఇదే.. మొత్తం ఎన్ని పోస్టుల‌కు నోటిఫికేష‌న్ అంటే..?

Published date : 18 Aug 2023 10:29AM

Photo Stories