Skip to main content

AP Tenth Supplementary Exams: ప‌దో త‌ర‌గ‌తి స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు ఏర్పాట్లు.. షెడ్యూల్ ఇలా!

పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారికి నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ప‌రీక్ష‌లో పాల్గొనే విద్యార్థుల సంఖ్య‌, అధికారులు చేసే ఏర్పాట్లు త‌దిత‌ర వివ‌రాల‌ను వెల్ల‌డించారు..
Arrangements for AP Tenth Students Supplementary Exams with schedule

రాయవరం: పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వారికి నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 24 నుంచి జూన్‌ 3 వరకు ప‌దో త‌ర‌గ‌తి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఫలితాల వెల్లడి రోజునే షెడ్యూల్‌ విడుదల చేసింది. గతంలో మాదిరిగా కాకుండా సప్లిమెంటరీ విద్యార్థులను కూడా రెగ్యులర్‌ విద్యార్థులుగానే పరిగణించనున్నారు. కోనసీమ జిల్లాలో 16 పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు చర్యలను చేపట్టారు.

JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు రికార్డు స్థాయిలో దరఖాస్తులు.. దాదాపు 11 ఏళ్ల తర్వాత మళ్లీ..

3,007 మంది విద్యార్థులు

కోనసీమ జిల్లాలో 18,787 మంది విద్యార్థులు ఈ ఏడాది మార్చి 18 నుంచి జరిగిన పది పరీక్షలకు హాజరు కాగా, 17,262 మంది ఉత్తీర్ణత సాధించారు. 1,525 మంది విద్యార్థులు వివిధ సబ్జెక్టుల్లో ఫెయిలయ్యారు. ఈ ఏడాది ఉత్తీర్ణత సాధించని విద్యార్థులతో పాటుగా, గతంలో ఫెయిలైన విద్యార్థులు కలసి మొత్తం 3,007 మంది వివిధ సబ్జెక్టుల పరీక్షలను రాయనున్నారు. సైన్స్‌ పరీక్షకు అత్యధికంగా 2,120 మంది హాజరవుతుండగా, అత్యల్పంగా హిందీ పరీక్షకు 471 మంది హాజరుకానున్నారు. అన్ని సబ్జెక్టులకు కలిపి 3,007 మంది పరీక్షలు రాయనున్నారు.

E Content Generation:అధ్యాప‌కుల‌కు ఈ కంటెంట్ జ‌న‌రేష‌న్‌పై శిక్ష‌ణ‌.. రెండో రోజు ఈ విష‌యాల అవ‌గాహ‌న‌!

జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం డివిజన్ల నుంచి 3,007 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. వీరందరికీ 16 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇప్పటికే విద్యార్థులకు హాల్‌ టికెట్లను పరీక్షల విభాగం ఆయా పాఠశాలలకు పంపించగా, హాల్‌ టికెట్లను హెచ్‌ఎంలు డౌన్‌లోడ్‌ చేసి, విద్యార్థులకు ఇచ్చే పనిలో ఉన్నారు. ఇదిలా ఉంటే గతేడాది మాదిరిగానే ఫెయిలైన విద్యార్థులకు ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఉన్నత పాఠశాలల్లో ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులు ప్రతి రోజు ఉత్తీర్ణత సాధించేలా మెళకువలను నేర్పిస్తున్నారు.

Paris Olympics 2024: పారిస్‌ ఒలింపిక్స్‌కు దూరమైన భారత మహిళా బాక్సర్!!

అవసరమైన ఏర్పాట్లు

పరీక్షా కేంద్రాల నిర్వహణకు అవసరమైన చీఫ్‌ సూపరింటెండెంట్లు, డీవోలు, ఇన్విజిలేటర్ల నియామకం దాదాపుగా పూర్తయింది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా విద్యుత్‌, తాగునీరు, ఫర్నీచర్‌ తదితర అవసరాల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమయ్యారు.

Training Camp in Library: వేస‌వి సెల‌వుల్లో గ్రంథాల‌యంలో శిక్ష‌ణ శిబిరాలు.. స‌ద్వినియోగం చేసుకోండి..

ఇదీ షెడ్యూల్‌

విద్యార్థులు పరీక్ష రాసే తేదీ

మే 24 ఫస్ట్‌ లాంగ్వేజ్‌ 973

మే 25 సెకండ్‌ లాంగ్వేజ్‌ 471

మే 27 ఇంగ్లిష్‌ 558

మే 28 గణితం 1,619

Telangana is now TG not TS: ఇక నుంచి టీఎస్‌ కాదు టీజీ.. ఇకపై అన్ని ఇలా..

మే 29 ఫిజిక్స్‌ 2,120

మే 30 బయాలజీ 2,120

మే 31 సోషల్‌ స్టడీస్‌ 927

జూన్‌1 ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌–2,

ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ 26 పేపర్‌–1

జూన్‌ 3 ఓఎస్‌ఎస్‌సీ మెయిన్‌ లాంగ్వేజ్‌ 26 పేపర్‌–2

Published date : 18 May 2024 04:25PM

Photo Stories