Skip to main content

SVNIRTAR Notification: ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌లో కోర్సుల ప్రవేశానికి కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌కు నోటిఫికేషన్‌ విడుదల..

ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌లో ఈ కోర్సుల్లో ప్రవేశానికి పరీక్ష రాసేందుకు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది సంస్థ. ఇన్‌స్టిట్యూట్‌ అండ్‌ టెస్ట్‌ వివరాలు ఇలా..
Entrance Test for Rehabilitation Courses 2024  Notification for entrance exam for admissions at SVNIRTAR  SVNIRTAR Common Entrance Test 2024 Notification  Apply Now for SVNIRTAR CET 2024

స్వామి వివేకానంద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌) 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బీపీటీ, బీఓటీ, బీపీవో, బీఏఎస్‌ఎల్‌పీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌–2024 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా ఎన్‌ఏఎల్‌డీ(కోల్‌కతా), ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌(కటక్‌), ఎన్‌ఐఈపీఎండీ(చెన్నై), పీడీయూఎన్‌ఐపీపీడీ(న్యూఢిల్లీ), సీఆర్‌సీఎస్‌ఆర్‌ఈ(గువాహటి)లో ప్రవేశాలు పొందవచ్చు.

AP DEESET 2024: ఏపీ డీఈఈసెట్‌ 2024 నోటిఫికేషన్‌ విడుదల

ఇన్‌స్టిట్యూట్‌ వివరాలు
»    నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ లోకోమోటర్‌ డిజేబిలిటీస్‌(దివ్యాంగ్‌జన్‌), కోల్‌కతా(ఎన్‌ఏఎల్‌డీ).
»    స్వామి వివేకానంద నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిహాబిలిటేషన్‌ ట్రైనింగ్‌ అండ్‌ రీసెర్చ్‌(ఎస్‌వీఎన్‌ఐఆర్‌టీఏఆర్‌), కటక్‌.
»    నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ మల్టిపుల్‌ డిజెబిలిటీస్‌(ఎన్‌ఐఈపీఎండీ), చెన్నై.
»    పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ పర్సన్స్‌ విత్‌ ఫిజికల్‌ డిజేబిలిటీస్‌(పీడీయూఎన్‌ఐపీపీడీ), న్యూఢిల్లీ.
»    కంపోజిట్‌ రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్, రిహాబిలిటేషన్‌ అండ్‌ఎంపవర్‌మెంట్‌ ఆఫ్‌ పర్సన్స్‌ విత్‌ డిజేబిలిటీస్‌(సీఆర్‌సీఎస్‌ఆర్‌ఈ), గువాహటి.

Chess Champions: భారతదేశానికి చెందిన చెస్ చిచ్చరపిడుగులు వీరే..

అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులు
»    బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజియోథెరపీ(బీపీటీ): నాలుగేళ్లు.
»    ఇంటర్న్‌షిప్‌: 6 నెలలు. 
»    బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆక్యుపేషనల్‌ థెర పీ(బీవోటీ): నాలుగేళ్లు. ఇంటర్న్‌షిప్‌: 6 నెలలు
»    బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్రోస్థెటిక్స్‌ అండ్‌ ఆర్థోటిక్స్‌(బీపీవో): నాలుగేళ్లు. ఇంటర్న్‌షిప్‌: 6 నెలలు
»    బ్యాచిలర్‌ ఇన్‌ అడియాలజీ అండ్‌ స్పీచ్‌ లాంగ్వేజ్‌ పాథాలజీ(బీఏఎస్‌ఎల్‌పీ): నాలుగేళ్లు. 
»     ఇంటర్న్‌షిప్‌: ఏడాది.
»    అర్హత: కనీసం 50% మార్కులతో పన్నెండో తరగతి/10+2(సైన్స్‌ సబ్జెక్టులు–ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ/మ్యాథమేటిక్స్‌) లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి.
»    వయసు: కనీసం 17 ఏళ్లు ఉండాలి. గరిష్ట వయోపరిమితి లేదు.
»    ఎంపిక విధానం: కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌–2024, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
»    తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, విజయవాడ.
»    ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 20.05.2024.
»    అడ్మిట్‌ కార్డ్‌ డౌన్‌లోడ్‌ తేది: 04.06.2024.
»    ప్రవేశ పరీక్ష తేది: 23.06.2024.
»    ఫలితాల ప్రకటన తేది: 05.07.2024.
»    వెబ్‌సైట్‌: https://admission.svnirtar.nic.in

PG Entrance Exam: పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ కోర్సులో ప్రవేశాలకు ఎన్‌ఐఎన్‌ పరీక్ష

Published date : 02 May 2024 11:44AM

Photo Stories