Skip to main content

LLB Exam: ఉస్మానియా బీఈడీ కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పరీక్షలు..

గురువారం ప్రారంభమైన ఎల్‌ఎల్‌బీ పరీక్షలకు హాజరైన విద్యార్థుల సంఖ్యను వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో జరిగిన పరీక్ష వివరాలను కూడా వివరించారు..
LLB Exams are started on Thursday at Osmania B Ed College

కర్నూలు కల్చరల్‌: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో ఎల్‌ఎల్‌బీ రెండు, నాలుగు, ఆరు, ఎనిమిది, పదో సెమిస్టర్‌ పరీక్షలు గురువారం ప్రారంభమయ్యాయి. కర్నూలు ఉస్మానియా బీఈడీ కళాశాలలో ఈ పరీక్షలు నిర్వహించారు. ఉదయం సెషన్‌లో జరిగిన మూడు సంవత్సరాల కోర్సు 6వ సెమిస్టర్‌, ఐదు సంవత్సరాల కోర్సు 10వ సెమిస్టర్‌ పరీక్షలకు 271 మందికి 262 మంది హాజరు కాగా 9 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ వెంకటేశ్వర్లు తెలిపారు. మధ్యాహ్నం సెషన్‌లో జరిగిన మూడు సంవత్సరాల కోర్సు రెండవ సెమిస్టర్‌, ఐదు సంవత్సరాల కోర్సు ఆరవ సెమిస్టర్‌ పరీక్షలకు 25 మందికి 17 మంది హాజరు కాగా 8 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు.

School Teachers: ముగ్గురు ఉపాధ్యాయులు సస్పెండ్‌..!

Published date : 29 Mar 2024 05:32PM

Photo Stories