Skip to main content

Self Employment for Women: మహిళలకు స్వయం ఉపాధి సంస్థ అందిస్తున్న ఉచిత శిక్షణ.. వివరాలు..

రేపటి నుంచి ఈ కోర్సుల్లో మహిళలకు శిక్షణ ప్రారంభం అవుతుందని దరఖాస్తులు చేసుకునేందుకు వివరాలను తెలిపారు సంస్థ డైరెక్టర్‌ సుంకం శ్రీనివాస్‌..
Free training for women  Free coaching for women in courses through self employment institute  State Bank of India Rural Self-Employment Training Institute at Dichpally

డిచ్‌పల్లి: డిచ్‌పల్లిలోని స్టేట్‌ బ్యాంక్‌ ఇండియా గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణా సంస్థ (ఆర్‌ఎస్‌ఈటీఐ) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణకు మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు సంస్ధ డైరెక్టర్‌ సుంకం శ్రీనివాస్‌ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ నెల 17 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. బ్యూటీపార్లర్‌, మగ్గంవర్క్‌, టైలరింగ్‌ (30 రోజులు) కోర్సుల్లో శిక్షణ ఇస్తారని వివరించారు. నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల గ్రామీణ ప్రాంత యువతులు 19 నుంచి 45 ఏళ్ల వయస్సు ఉన్న వారు ఈ శిక్షణకు అర్హులని తెలిపారు.

After 10th & Inter: పది, ఇంటర్‌తో పలు సర్టిఫికేషన్‌ కోర్సులు.. ఉద్యోగావకాశాలకు మార్గాలు ఇవే!!

ఆసక్తి గల అభ్యర్థులు ఆధార్‌, రేషన్‌కార్డు, ఎస్సెస్సీ మెమో, 5 పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటోలు వెంట తీసుకుని, ఆర్‌ఎస్‌ఈటీఐలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనం, హాస్టల్‌ వసతి కల్పిస్తామన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న అనంతరం ధ్రువీకరణపత్రం, టూల్‌ కిట్‌ అందజేస్తామని, ఈ అవకాశాన్ని ఆసక్తి, అర్హత గల మహిళలు సద్వినియోగం చేసుకోవాలని డైరెక్టర్‌ కోరారు. పూర్తి వివరాలకు 08461 295428 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Summer Sports Training: వేసవి క్రీడా శిక్షణ దరఖాస్తుల ఆహ్వానం

Published date : 16 Apr 2024 04:51PM

Photo Stories