Skip to main content

బయోటెక్నాలజీ విభాగంలో 28 ఫెలోషిప్‌లు.. దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్‌ 7..

భారత ప్రభుత్వ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకు చెందిన బయోటెక్నాలజీ విభాగంలో.. జెనెటిక్‌ డయాగ్నస్టిక్స్‌లో ఫెలోషిప్‌ చేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీల సంఖ్య: 28
ఫెలోషిప్‌ అందిస్తున్న సంస్థలు: ఎన్‌జీపీజీఐ, రాయ్‌బరేలీ(యూపీ), క్రిస్టియన్‌ మెడికల్‌ కాలేజ్, వెల్లూరు(తమిళనాడు), సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ప్రింటింగ్‌ అండ్‌ డయాగ్నస్టిక్స్, హైదరాబాద్, ఎయిమ్స్, న్యూఢిల్లీ, ఐసీఎంఆర్‌–ఎన్‌ఐఐహెచ్, ముంబై, మౌలానా ఆజాద్‌ మెడికల్‌ కాలేజ్, న్యూఢిల్లీ.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్టు గ్రాడ్యుయేట్‌ డిగ్రీ(ఎండీ/ఎంఎస్‌/డీఎన్‌బీ) ఉత్తీర్ణులవ్వాలి.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్, టెలిఫోనిక్‌ ఇంటర్వూ్య ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకు సంబంధిత ధ్రువపత్రాలు జతచేసి ఎంచుకున్న సంస్థ ట్రెయినింగ్‌ కోఆర్డినేటర్‌కి పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 31.03.2021

పూర్తి వివ‌రాల‌కు వెబ్‌సైట్‌: http://dbtindia.gov.in/

Photo Stories