Skip to main content

NTA: నీట్‌ యూజీ– 2023 తేదీ ఖరారు

సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, బీడీఎస్, ఇతర యూజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే National Eligibility, Entrance Test (NEET) యూజీ– 2023 తేదీ ఖరారైంది.
NEET UG 2023 Exam Date
NTA: నీట్‌ యూజీ– 2023 తేదీ ఖరారు

National Testing Agency (NTA) నీట్‌ యూజీ– 2023 క్యాలెండర్‌ను డిసెంబర్‌ 16న ప్రకటించింది. 2023 మే 7న దేశ వ్యాప్తంగా నీట్‌ యూజీ పరీక్ష నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్ష రాయడానికి దరఖాస్తుల ప్రక్రియను త్వరలోనే ప్రారంభించనున్నట్లు పేర్కొంది.

Also Read: NEET - QUICK REVIEW | GUIDANCE | BIT BANK | MODEL PAPERS | PREVIOUS PAPERS | GUEST SPEAKS | CUT-OFF RANKS

17 ఏళ్ల వయసు కలిగి, గుర్తింపు కలిగిన బోర్డుల్లో బయోలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లిష్‌ కోర్‌ సబ్జెక్టులుగా ఇంటర్‌ లేదా సమానమైన డిప్లమో కోర్సులు చేసిన విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులు. దేశ వ్యాప్తంగా 645 మెడికల్, 318 డెంటల్, 914 ఆయుష్, ఇతర కళాశాలల్లో నీట్‌–యూజీ అర్హత ఆధారంగా ప్రవేశాలుంటాయి. 

చదవండి: నీట్ - సక్సెస్ స్టోరీస్ | న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్

Published date : 17 Dec 2022 02:29PM

Photo Stories