Skip to main content

యూజీ ఆయుష్‌ సీట్ల భర్తీకి మరో అవకాశం

యూజీ ఆయుష్‌ సీట్ల ఖాళీల భర్తీకి కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వ శాఖ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
Another opportunity to recruitment UG AYUSH seats
యూజీ ఆయుష్‌ సీట్ల భర్తీకి మరో అవకాశం

యూజీ నీట్‌ ఆయుష్‌ కటాఫ్‌ స్కోర్‌ను 5 శాతం తగ్గిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఆ మేరకు క్వాలిఫైయింగ్‌ కటాఫ్‌ జనరల్‌ కేటగిరీ 45వ పర్సెంటైల్, దివ్యాంగుల (జనరల్‌)కు 40, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వ్‌డ్‌ కేటగిరీలకు 35 పర్సెంటైల్‌గా నిర్ణయించారు. కటాఫ్‌ మార్కులు తగ్గడంతో ఇందుకనుగుణంగా అర్హులైన అభ్యర్థులు బీహెచ్‌ఎంఎస్, బీఏఎంఎస్, బీఎన్ వైఎస్, బీయూఎంఎస్‌ కనీ్వనర్‌ కోటా అలాగే బీహెచ్‌ఎంఎస్‌ యాజమాన్య కోటాల్లో దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కలి్పస్తూ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏప్రిల్‌ 1న మరోసారి ప్రవేశ ప్రకటన జారీచేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు కన్వీనర్, యాజమాన్య కోటాలకు విడివిడిగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. తగ్గిన కటాఫ్‌ స్కోర్‌ ఆధారంగా అర్హత సాధించిన అభ్యర్థులు ఏప్రిల్‌ 1న నుంచి 3వ తేది మధ్యాహ్నం 2 గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తుతో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుందని వివరించింది. దరఖాస్తుల పరిశీలన అనంతరం తుది మెరిట్‌ జాబితాను విడుదల చేస్తామని, మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ని సందర్శించాలని సూచించింది. 

Sakshi Education Mobile App
Published date : 02 Apr 2022 05:22PM

Photo Stories