Skip to main content

తెలంగాణ గురుకుల డిగ్రీ కాలేజీల్లో సబల క్లబ్‌లు

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కాలేజీల్లో సబల క్లబ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు.
గురువారం తన కార్యాలయం నుంచి ఆయన సబల క్లబ్‌లను లాంఛనంగా ప్రారంభించారు. డిగ్రీ కాలేజీల్లోని విద్యార్థినులను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఈ క్లబ్‌లు ఉపయోగపడతాయని తెలిపారు. గురుకులాల్లో చదివిన పూర్వ విద్యార్థులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కావాలన్న ఆలోచనలున్న వారు, మహిళా పారిశ్రామికవేత్తల సహకారంతో ఈ క్లబ్‌లను నిర్వహించనున్నట్లు వివరించారు.
Published date : 26 Mar 2021 03:31PM

Photo Stories