నైపర్‌లో కొత్త ఎంటెక్ కోర్సు షురూ!
Sakshi Education
బాలానగర్ (హైదరాబాద్): ప్రపంచవ్యాప్తంగా వైద్య అవసరాల కోసం పెరుగుతున్న ఆదరణ దృష్ట్యా ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (నైపర్) ఓ కొత్త ఎంటెక్ కోర్సును ప్రవేశపెట్టింది.
ఈ కోర్సు వివరాలను హైదరాబాద్ బాలానగర్‌లోని నైపర్ క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీన్ శ్రీనివాసులు వెల్లడించారు. మెడికల్ పరికరాల అభివృద్ధికి అవసరమైన జీవశాస్త్రం, కెమిస్ట్రీ, గణితం, క్లినికల్ సైన్స్, ఇంజనీరింగ్‌లకు సంబంధించిన అంశాలను కలిగి ఉండేలా ఈ కోర్సును రూపొందించి నట్లు వివరించారు. ఈ కోర్సులో వివిధ వైద్య పరికరాల్లో ప్రోటోటైప్‌లను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించి సంవత్సరం ప్రాజెక్టు వర్క్ ఉంటుందన్నారు. నైపర్‌కు చెందిన హైదరాబాద్, గౌహతి, మొహాలీ క్యాంపస్‌లలో ఒక్కో క్యాంపస్‌కు 10 సీట్ల చొప్పున కేటాయించినట్లు తెలిపారు. ఈ కోర్సులో ప్రవేశాలకు బీ-ఫార్మా, ఎంఎస్సీ, బీటెక్, బీఈ, ఎంబీబీయస్, బీడీయస్, బీవీఎస్సీ చదివినవారు అర్హులన్నారు. దీనికి సంబంధించి నవంబర్ 15 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని, ఉమ్మడి ప్రవేశ పరీక్ష డిసెంబర్ 4న ఉంటుందని తెలిపారు. మరిన్ని వివరాలకు www.niperhyd.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు.
Published date : 03 Nov 2020 04:33PM