మరో 88 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్య కళాశాలలకు మరో 88 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేశారు.
మూడో దశ కౌన్సెలింగ్‌లో భాగంగా వైద్యవిద్యా శాఖ సంచాలకులు డా.కె.వెంకటేష్ బుధవారం ఈ ప్రక్రియను పూర్తి చేశారు. వివిధ విభాగాల్లో 88 మందికి నియామక ఉత్తర్వులు ఇచ్చారు. మొదటి, రెండో దశ కౌన్సెలింగ్‌లో 442 మందిని నియమించగా వీరిలో 300 మంది విధుల్లో చేరారు. మూడో దశ కౌన్సెలింగ్‌లో 118 పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించి, 88 మందిని ఎంపిక చేశారు. ఇవి డెరైక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా చేసినవి. మిగతా 295 పోస్టులు లేటరల్ ఎంట్రీ.. అంటే ప్రజారోగ్యం, వైద్యవిధాన పరిషత్‌లో పీజీ పూర్తి చేసి పని చేస్తున్న వైద్యులను బోధనాసుపత్రుల పరిధిలోకి తీసుకున్నారు.
Published date : 10 Dec 2020 04:02PM