మద్రాసు ఐఐటీలో ఆన్‌లైన్ బీఎస్సీ పోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ కోర్స్
Sakshi Education
తెలంగాణ నుంచి 448 మంది.. ఏపీ నుంచి 337 మందికి అర్హత
సాక్షి, హైదరాబాద్: మద్రాసు ఐఐటీ తొలిసారిగా ప్రోగ్రామింగ్ అండ్ డేటా సైన్స్ లో బీఎస్సీ డిగ్రీని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తోంది.
2021 జనవరి నుంచి ఈ కోర్సు ప్రారంభించనుంది. దీని ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షలో 8,154 మంది (మహిళలు 1,922 మంది, పురుషులు 6,232 మంది) అర్హత సాధించారు. అందులో ఆర్‌ట్స/సైన్స్/కామర్స్ చదువుకున్న 1,593 మంది, ఇంజనీరింగ్ చదువుకున్న 3,450 మంది, ఇతర కోర్సులు చదువుకున్న 3,111 మంది ఉన్నా రు. అర్హత సాధించిన వారిలో తెలంగాణ విద్యార్థులు 448 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 337 మంది ఉన్నారు. ఇక అర్హత సాధించిన వారిలో 20 ఏళ్లలోపు వారు 4,469 మంది, 21 నుంచి 30 ఏళ్లలోపు వారు 2,739 మంది, 31-40 ఏళ్ల వారు 676 మంది, 41-50 ఏళ్ల వారు 210 మంది, 51-60 ఏళ్ల వారు 56 మం ది, 61-70 ఏళ్ల వారు నలుగురు ఉన్నట్లు మద్రాస్ ఐఐటీ వివరించింది.
Published date : 10 Dec 2020 04:13PM