Skip to main content

డిసెంబర్‌లో ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు

సాక్షి, హైదరాబాద్: తమ పరిధిలోని ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కాలేజీల్లో వసతులు, అధ్యాపకులకు సంబంధించిన సమగ్ర వివరాలను తెలుసుకునేందుకు నిజ నిర్ధారణ కమిటీల (ఎఫ్‌ఎఫ్‌సీ) ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టనున్నట్లు జేఎన్‌టీయూ వెల్లడించింది.
డిసెం బర్‌లో ఈ తనిఖీలు చేపట్టాలని పేర్కొంది. అఫీలియేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన కాలేజీలన్నీ నవంబర్ 2 సాయంత్రం 4:30 గంటలలోగా అఫిడవిట్ అందజేయాలని స్పష్టం చేసింది. వాటికి 2020-21 విద్యా సంవత్సరపు ప్రొవిజనల్ అఫీలియేషన్ లేఖలు ఇస్తామని వెల్లడించింది.
Published date : 28 Oct 2020 03:21PM

Photo Stories