Skip to main content

వైద్యవిద్యకు ‘పీపీపీ’ మోడల్!: నీతి ఆయోగ్

న్యూఢిల్లీ: నిపుణులైన వైద్యుల కొరతను అధిగమించేందుకు నీతి ఆయోగ్ కొత్త ప్రతిపాదన చేసింది.
ప్రైవేటు మెడికల్ కాలేజీలను ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులకు ‘ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ)’ ద్వారా అనుసంధానం చేయాలని ప్రతిపాదించింది. ప్రస్తుతం ఈ తరహా విధానం గుజరాత్, కర్నాటకల్లో అమల్లో ఉందని ‘మోడల్ కన్సెషన్ అగ్రీమెంట్ ఫర్ సెట్టింగ్ అప్ మెడికల్ కాలేజెస్ అండర్ ద పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్’ అనే ముసాయిదా పత్రం పేర్కొంది. దేశంలో నిపుణులైన వైద్యుల కొరత భారీగా ఉందని , వైద్య విద్యకు సంబంధించి ఈ లోటును తీర్చడం వనరుల కొరతతో ఇబ్బంది పడుతున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పట్లో సాధ్యం కాదని నీతి ఆయోగ్ అందులో పేర్కొంది.
Published date : 02 Jan 2020 03:05PM

Photo Stories