త్వరలో రెండో దఫా వైద్య నియామకాలు..!
Sakshi Education
సాక్షి, అమరావతి: వైద్యవిధాన పరిషత్ పరిధిలోని సామాజిక ఆరోగ్యకేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో పనిచేయడానికి స్పెషలిస్టుల నియామకాలు చేపట్టనున్నట్లు వైద్య విధాన పరిషత్ కమిషనర్ డా.యు.రామకృష్ణారావు వెల్లడించారు.
ఇప్పటికే మొదటిసారి నోటిఫికేషన్ ద్వారా నియామకాలు పూర్తయ్యాయని, మిగిలిన పోస్టులకు వారం రోజుల్లో రెండోదఫా నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. నోటిఫికేషన్ ఇచ్చాక వారం రోజుల్లోనే నియామక ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.
Published date : 31 Dec 2020 01:35PM