Skip to main content

కొత్త వైద్య కళాశాలల నిర్మాణాలకు మార్గదర్శకాలు

సాక్షి, అమరావతి: మూడేళ్లలోగా కొత్తగా 16 వైద్య కళాశాలలు నిర్మించాలని, దీనికనుగుణంగా టెండర్లు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
16 కొత్త మెడికల్ కాలేజీలతో పాటు ఐటీడీఏ ప్రాంతాల్లో 5 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు, ప్రస్తుతం ఉన్న 11 వైద్య కళాశాలల ఉన్నతీకరణ, నర్సింగ్ కాలేజీల నిర్మాణ టెండర్లకు సంబంధించి ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డా.కె.ఎస్ జవహర్ రెడ్డి మంగళవారం మార్గదర్శకాలు జారీ చేశారు.
Published date : 11 Nov 2020 01:46PM

Photo Stories