Skip to main content

జయశంకర్ వ్యవసాయ వర్సిటీలో నవంబర్ 10 నుంచి రెండో విడత కౌన్సెలింగ్

సాక్షి, హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వివిధ డిప్లొమా కోర్సులకు సంబంధించి రెండో విడత కౌన్సెలింగ్‌ను నవంబర్10 నుంచి 13 వరకు నిర్వహించనున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎస్.సుధీర్‌కుమార్ తెలిపారు.
మొదటి కౌన్సెలింగ్ తర్వాత మిగిలిన సీట్లకు ఈ రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు వెంటనే ఫీజు చెల్లించాలన్నారు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం సీట్ల కేటాయింపు ఉంటుందని వివరించారు. మరిన్ని వివరాల కోసం వర్సిటీ వెబ్‌సైట్ www.pjtsau.edu.in ను సందర్శించాలని సూచించారు.
Published date : 09 Nov 2020 03:39PM

Photo Stories