ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీపీజీ మెడికల్ పరీక్షలు వాయిదా
Sakshi Education
విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏప్రిల్ 28 నుంచి జరగాల్సిన పీజీ (డిగ్రీ/డిప్లమో) మెడికల్ పరీక్షలు వాయిదా వేసినట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.శంకర్ మార్చి 27 (శుక్రవారం)న ఒక ప్రకటనలో తెలిపారు.
కోవిడ్ -19 కారణంగా పరీక్షలు వాయిదా వేశామని, తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియజేస్తామన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి అనుబంధంగా ఉన్న పీజీ మెడికల్ కళాశాలల్లోని నోటీస్ బోర్డుల్లో ఈ అంశాన్ని పొందుపరచాలని ప్రిన్సిపాల్స్‌ను కోరారు.
Published date : 28 Mar 2020 03:12PM