ఆగస్టు21, 22న పీజీ మెడికల్, డెంటల్ ప్రవేశాలకువెబ్ ఆప్షన్లు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని పీజీ మెడికల్, డెంటల్ కళాశాలల్లో మిగిలిపోయిన కన్వీనర్ కోటా సీట్ల భర్తీకి ఈ నెల 21న ఉదయం 8 గంటల నుంచి 22న మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రాధాన్యత క్రమంలో కళాశాలల వారీగా వెబ్ ఆప్షన్లను నమోదు చేసుకోవాలని కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
అర్హులైన అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చని పేర్కొంది. గత విడత కౌన్సెలింగ్‌లో సీటు అలాట్ అయినా చేరని అభ్యర్థులు, కళాశాలలో చేరి డిస్‌కంటిన్యూ చేసిన అభ్యర్థులు ఈ వెబ్ కౌన్సెలింగ్‌కు అనర్హులని ప్రకటించింది. ఆలిండియా కోటా కౌన్సెలింగ్ కింద ఇప్పటికే చేరిన అభ్యర్థులను కూడా అనర్హులుగా పరిగణిస్తారని తెలిపింది. మరిన్ని వివరాలకు www.knruhs.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది.
Published date : 21 Aug 2020 02:08PM