LAWCET 2022: పరీక్ష తేదీలు ఇవే.. హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోండి..
Sakshi Education
LAW కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే LAWCET జూలై 21, 22 తేదీల్లో జరగనుంది. మూడేళ్ల లాసెట్ 21న ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు ఒక విడత.. సాయంత్రం 2.30 నుంచి 4 గంటల వరకు రెండో విడత పరీక్ష జరగనుంది.
ఇక ఐదేళ్ల LAWCET, పోస్టు గ్రాడ్యుయేట్ లాసెట్‌ను 22న ఉదయం 10.30 నుంచి 12 గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు హాల్ టికెట్లను https://lawcet.tsche.ac.in వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలంగాణ లాసెట్ కన్వీనర్ జీబీ రెడ్డి తెలిపారు. LAWCET కోసం తెలంగాణలో 38, ఏపీలో 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు. అన్ని విభాగాల లాసెట్‌కు 35,538 మంది దరఖాస్తు చేసుకున్నట్లు చెప్పారు.
చదవండి:
Published date : 20 Jul 2022 03:28PM