Science Seminar: పాఠశాలలో నిర్వహించనున్న సైన్స్ సెమినార్
సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ సంస్థ ఆదేశాల మేరకు ఈనెల 16వ తేదీన జిల్లాస్థాయి సైన్స్ సెమినార్‌ను పట్టణంలోని జెడ్పీహెచ్‌ఎస్ దేవునిపల్లి పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా సైన్స్ అధికారి సిద్ధిరాంరెడ్డి తెలిపారు. మిల్లెట్స్ ఒక సూపర్ ఫుడ్ లేదా వ్యామోహమా?’ అనే అంశం మీద జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలలో 8,9,10, తరగతులు చదువుతున్న వివిధ మాద్యమాల్లో చదువుతున్న విద్యార్థులు పాల్గొనవచ్చన్నారు.
India Position In AI Technology: ఏఐ ప్రపంచంలో మన స్థానమెక్కడ?
విద్యార్థులు 6 నిమిషాల నిడివి ఉన్న సెమినార్ చార్ట్స్ లేదా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రదర్శించవచ్చన్నారు. మొదటి స్థానం వచ్చిన విద్యార్థులను 19వ తేదీన రాష్ట్ర స్థాయిలో హైదరాబాద్‌లో జరిగే సెమినార్‌కు ఎంపిక చేస్తామన్నారు. విద్యార్థులు 16వ తేదీ ఉదయం 10 గంటలకు వారి గైడ్ టీచర్స్ సాయంతో రిజిస్ట్రేషన్ చేసుకొని పాల్గొనాలన్నారు. 9440414250లో సంప్రదించాలన్నారు.