6 నుంచి IIIT తరగతులు ప్రారంభం
నూజివీడు/సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్‌జీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్ ఐటీలు వేసవి సెలవుల అనంతరం ఈ నెల ఆరో తేదీ నుంచి పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఆర్జీయూకేటీ చాన్సలర్ ఆచార్య కేసీ రెడ్డి, వైస్ చాన్సలర్ ఆచార్య కె.హేమచంద్రారెడ్డి సంయుక్తంగా శుక్రవారం ఏలూరు జిల్లా నూజివీడులో విడుదల చేసిన ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. కొద్దిరోజులుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పునఃప్రారంభాన్ని వాయిదా వేయాలని కోరుతున్నప్పటికీ యూనివర్సిటీ షెడ్యూల్ ప్రకారం తరగతులు నిర్వహించాల్సి ఉన్నందున నాలుగు ట్రిపుల్ ఐటీల్లో ఆరో తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తున్నట్టు వివరించారు. వేసవి ఎండల దృష్ట్యా ఎవరైనా విద్యార్థులు వారి క్యాంపస్‌లకు రాలేకపోతే ఈ నెల 6వ తేదీ నుంచి 10 వరకు మాత్రమే నిర్వహించే ఆన్‌లైన్ తరగతులకు హాజరుకావచ్చని పేర్కొన్నారు. వీరు తమ పేర్లను ఆయా క్యాంపస్‌ల డీన్‌ల వద్ద ఐదో తేదీ కల్లా నమోదు చేసుకోవాలని సూచించారు.
Also read: Govt schools: ఇంగ్లిష్ మీడియంపై విద్యార్థుల్లో ఆసక్తి..