GATE Notification 2026 : గేట్ 2026 నోటిఫికేషన్ విడుదల.. ఫిబ్రవరీ 2026లో సీబీటీ పరీక్ష

సాక్షి ఎడ్యుకేషన్: ఇది జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రతిష్టాత్మక పరీక్ష. గేట్ స్కోర్‌తో బహుళ ప్రయోజనాలు అందుకోవచ్చు. టాప్ ఇన్‌స్టిట్యూట్స్‌లో ఉన్నత విద్యతోపాటు ప్రభుత్వ రంగ సంస్థల్లో కొలువులు సొంతం చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా మాస్టర్స్, డాక్టోరల్ ప్రోగ్రామ్స్‌లో చేరి స్కాలర్‌షిప్ పొందేందుకు మార్గం గేట్.
ఈ నేపథ్యంలో.. గేట్ 2026తో ప్రయోజనాలు, దరఖాస్తుకు అర్హతలు, పరీక్ష ప్యాట్రన్, సిలబస్ అంశాలు, ప్రిపరేషన్ తదితర వివరాలు..
గేట్ 2026 పరీక్షను కేంద్ర విద్యాశాఖ తరఫున ఐఐఎస్సీ–బెంగళూరు, ఐఐటీలు ఉమ్మడిగా నిర్వహిస్తాయి. ఐఐటీ గౌహతి ఈ పరీక్ష నిర్వాహక సంస్థగా ఉంది. ఇంజనీరింగ్/టెక్నాలజీ/సైన్స్/కామర్స్/ఆర్ట్స్/ఆర్కిటెక్చర్/హు్యమానిటీస్ విభాగాల్లో గేట్ పరీక్షను నిర్వహిస్తారు. అండర్‌గ్రాడ్యుయేట్ స్థాయిలోని విభిన్న సబ్జెక్టుల్లో అభ్యర్థి ప్రావీణ్యాన్ని పరీక్షించేలా ప్రశ్న పత్రం ఉంటుంది.
Job Mela: ఉద్యోగార్థులకు శుభవార్త.. రేపు డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా
గేట్‌తో ప్రయోజనాలు:
- గేట్ 2026 స్కోర్‌తో ఇంజనీరింగ్/టెక్నాలజీ/సైన్స్/ఆర్కిటెక్చర్/హుమానిటీస్ విభాగాల్లో మాస్టర్స్ ప్రోగ్రామ్స్, డైరెక్ట్ డాక్టోరల్(బీటెక్/బీఈ/ఎమ్మెస్సీ తత్సమానం తర్వాత నేరుగా పీహెచ్‌డీ), డాక్టోరల్ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశం పొందిన విద్యార్థులు కేంద్ర విద్యాశాఖ, ఇతర ప్రభుత్వ సంస్థల నుంచి ఆర్థిక సహాయం(స్కాలర్‌షిప్‌లు /ఫెలోషిప్పులు) పొందే అవకాశం ఉంటుంది.
- గేట్ స్కోర్‌తో ఎంటెక్ విద్యార్థులకు నెలకు రూ.12వేల స్కాలర్‌షిప్ అందుతుంది. సాధారణంగా 22 నెలల పాటు ఈ ఉపకార వేతనం లభిస్తుంది.
- గేట్ స్కోర్‌తో పీహెచ్‌డీలో ప్రవేశం పొందిన వారికి మొదటి రెండేళ్లు నెలకు రూ.37వేలు, ఆ తర్వాత మూడో ఏడాది నుంచి ఐదో ఏడాది వరకూ నెలకు రూ.42వేలు ఫెలోషిప్ అందుతుంది.
- స్కాలర్‌షిప్‌లు అందించని పలు కాలేజీలు, ఇన్‌స్టిట్యూట్స్ సైతం గేట్ స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తున్నాయి.
- గేట్ స్కోర్‌తో బీహెచ్‌ఈఎల్, ఈసీఐఎల్, ఐవోసీఎల్, ఎన్‌టీపీసీ, ఓఎన్‌జీసీ వంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్‌యూ)లు నియామకాలు జరుపుతున్నాయి.
అర్హతలు:
ఇంజనీరింగ్/టెక్నాలజీ/ఆర్కిటెక్చర్/సైన్స్/కామర్స్/ఆర్ట్స్/హ్యుమానిటీస్ విభాగాల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సు ఉత్తీర్ణులు లేదా ఆయా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులు గేట్ 2026కు దరఖాస్తు చేసుకోవచ్చు.
పరీక్ష విధానం:
- మొత్తం 30 టెస్ట్ పేపర్లలో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ) విధానంలో గేట్ 2026 పరీక్ష నిర్వహించనున్నారు.–ఒకటి లేదా రెండు టెస్ట్ పేపర్లకు అభ్యర్థులు హాజరయ్యే అవకాశం ఉంది.
- గేట్ పరీక్షలో జనరల్ అప్టిట్యూడ్(15 మార్కులకు) అందరికీ కామన్‌గా ఉంటుంది. మిగతా 85 మార్కులకు అభ్యర్థి ఎంచుకునే సంబంధిత సబ్జెక్టు నుంచి ప్రశ్నలు అడుగుతారు.
- కొన్ని పేపర్లలో జనరల్ అప్టిట్యూడ్ 15 మార్కులకు,ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 13మార్కులకు, సంబంధిత సబ్జెక్టు 72 మార్కులకు ఉంటాయి.
- ప్రశ్న పత్రంలో మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు(ఎంసీక్యూ), మల్టిపుల్ సెలక్ట్ ప్రశ్నలు(ఎంఎస్‌క్యూలు), న్యూమరికల్ ఆన్సర్ టైప్ (ఎన్‌ఏటీ) ప్రశ్నలు అడుగుతారు ప్రతి ప్రశ్నకు ఒకటి లేదా రెండు మార్కులు కేటాయిస్తారు.
- ఈ పరీక్ష ప్రశ్న పత్రం ఇంగ్లిష్‌లో ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
- గేట్ 2026లో నెగిటివ్ మార్కుల నిబంధన ఉంది. ఒక మార్కు ఎంసీక్యూల్లో ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు మార్కు తగ్గిస్తారు. రెండు మార్కుల ఎంసీక్యూల్లో ప్రతి తప్పు సమాధానానికి 2/3 వంతు మార్కు తగ్గిస్తారు. ఎంఎస్‌క్యూలు, ఎన్‌ఏటీల్లో ఎలాంటి నెగిటివ్ మార్కులు ఉండవు.
Gurukulam Admissions: గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. ప్రవేశ పరీక్ష ఎప్పుడంటే..
30 టెస్ట్ పేపర్లు ఇవే
ఎయిరోస్పేస్ ఇంజనీరింగ్, అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్ అండ్ ప్లానింగ్, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, సివిల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కెమిస్ట్రీ, డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎకాలజీ అండ్ ఎవల్యూషన్, జియోమాటిక్స్ ఇంజనీరింగ్, జియాలజీ అండ్ జియోఫిజిక్స్, ఇన్స్‌ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, మెట్లర్జికల్ ఇంజనీరింగ్, నావెల్ ఆర్కిటెక్చర్ అండ్ మెరైన్ ఇంజనీరింగ్, పెట్రోలియం ఇంజనీరింగ్, ఫిజిక్స్, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, స్టాటిస్టిక్స్, టెక్స్‌టైల్ ఇంజనీరింగ్ అండ్ ఫైబర్ సైన్స్, ఇంజనీరింగ్‌సైన్సెస్, హ్యుమానిటీస్ అండ్ సోషల్‌సైన్సెస్, లైఫ్ సైన్సెస్.
ముఖ్య తేదీలు:
- దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 25.08.2025
- ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేది: 25.09.2025
- ఆలస్య రుసుముతో దరఖాస్తులకు చివరి తేది: 06.10.2025
- గేట్ 2026 పరీక్ష తేదీలు: 2026 ఫిబ్రవరి 07, 08, 14, 15
- ఫలితాల వెల్లడి తేది: 19.03.2026
- వెబ్‌సైట్: https://gate2026.iitg.ac.in
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- admissions
- GATE Notification
- engineering entrance exam
- GATE 2026
- Applications and Eligibilities for GATE
- Graduate Aptitude Test in Engineering
- GATE IIT Guwahati
- Eligibilities and Exam Details for GATE 2026
- M. Tech and Ph D Admission Exams 2026
- IIT Guwahati Admissions 2026
- Admissions Exams 2026
- Notification for GATE 2026
- GATE 2026 Exam and Syllabus Pattern
- Admissions with GATE 2026
- latest admissions notifications
- Education News
- Sakshi Education News
- GATE Scholarships