Skip to main content

IndianNavy: ప్రాజెక్ట్ 17 కింద భారత నౌకాదళంలోకి చేరనున్న INS ఉదయగిరి, హిమగిరి యుద్ధనౌకలు...వీటి ప్రత్యేకతలివే...!

సాక్షి ఎడ్యుకేషన్: మన దేశంలోని రెండు షిప్‌యార్డుల్లో నిర్మితమైన రెండు ఆధునిక యుద్ధనౌకలు ఆగస్టు 26న భారత నౌకాదళంలో చేరనున్నాయి. అత్యాధునిక ఫ్రంట్‌లైన్‌ స్టీల్‌ ఫ్రిగేట్‌లను జాతికి అంకితం చేసే ఈ కార్యక్రమం విశాఖపట్నంలో భవ్యంగా జరగనుంది.
visakhapatnam-indian-navy-indigenous-warships project-17 shivalik-class-upgrade

స్వదేశీ సాంకేతికతతో...

  • ముంబైలోని మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (MDL) లో ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి, కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (GRSE) లో ఐఎన్‌ఎస్‌ హిమగిరి యుద్ధనౌకలు పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో రూపుదిద్దుకున్నాయి.
ప్రాజెక్ట్‌–17లో భాగంగా...
  • ప్రాజెక్ట్‌–17లో భాగంగా వీటిని అత్యాధునిక నావికా సాంకేతికతతో నిర్మించారు. ఐఎన్‌ఎస్‌ ఉదయగిరి నేవీ వార్‌షిప్‌ డిజైన్‌ బ్యూరో రూపొందించిన 100వ యుద్ధనౌకగా ప్రత్యేకత సంతరించుకుంది. సుమారు 6,700 టన్నుల బరువుతో, ఇవి శివాలిక్‌–క్లాస్‌ ఫ్రిగేట్స్‌ కంటే దాదాపు 5% ఎక్కువ పరిమాణంలో ఉన్నాయి.
శక్తివంతమైన ఆయుధ వ్యవస్థలు ...
  • వీటిలో సూపర్‌సోనిక్‌ సర్ఫేస్‌–టు–సర్ఫేస్‌ క్షిపణులు, మీడియం రేంజ్‌ సర్ఫేస్‌–టు–ఎయిర్‌ క్షిపణులు, 76 ఎంఎం ఎంఆర్‌ గన్స్, యాంటీ–సబ్‌మెరైన్‌/అండర్‌వాటర్‌ వెపన్‌ సిస్టమ్స్‌ వంటి శక్తివంతమైన ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి. 


భారత నౌకాదళ శక్తి, సత్తాను ప్రపంచానికి తెలియజేసే ఈ అంకితోత్సవాన్ని తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రం విశాఖపట్నంలో నిర్వహించనున్నట్లు నౌకాదళ అధికారులు తెలిపారు.

INS ఉదయగిరి, INS హిమగిరిలతో భారత నౌకాదళ శక్తికి కొత్త రెక్కలు

ఎక్కడ నిర్మించబడ్డాయంటే....?
  • INS ఉదయగిరి – ముంబైలోని మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (MDL)
  • INS హిమగిరి – కోల్‌కతాలోని గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (GRSE)

ఇవి రెండూ పూర్తిగా స్వదేశీ నౌకా సాంకేతికతతో రూపుదిద్దుకున్నాయి.

100వ యుద్ధనౌక రూపొందించి చరిత్ర సృష్టించిన నేవీ వార్‌షిప్‌ డిజైన్‌ బ్యూరో...
  • ఈ రెండు యుద్ధనౌకలు ప్రాజెక్ట్–17 సిరీస్‌లో భాగంగా నిర్మించబడ్డాయి. INS ఉదయగిరి, నేవీ వార్‌షిప్‌ డిజైన్‌ బ్యూరో రూపొందించిన 100వ యుద్ధనౌకగా చరిత్ర సృష్టించింది.
సాంకేతిక లక్షణాలు..
  • బరువు: సుమారు 6,700 టన్నులు
  • పరిమాణం: శివాలిక్‌–క్లాస్‌ ఫ్రిగేట్ల కంటే దాదాపు 5% ఎక్కువ
ఆయుధ వ్యవస్థలు:
  • సూపర్‌సోనిక్ సర్ఫేస్‌–టు–సర్ఫేస్‌ క్షిపణులు
  • మీడియం రేంజ్‌ సర్ఫేస్‌–టు–ఎయిర్‌ క్షిపణులు
  • 76 ఎంఎం ఎంఆర్‌ గన్స్
  • యాంటీ–సబ్‌మెరైన్/అండర్‌వాటర్ వెపన్ సిస్టమ్స్
వ్యూహాత్మక ప్రాధాన్యం...
  • INS ఉదయగిరి, హిమగిరి యుద్ధనౌకలు సముద్ర భద్రత, వ్యూహాత్మక ఆపరేషన్లు, మరియు శత్రు నౌకల నిరోధంలో కీలక పాత్ర పోషించనున్నాయి. ఇవి అధునాతన రాడార్, సెన్సార్లు, మరియు ఎలక్ట్రానిక్‌ వార్‌ఫేర్‌ సిస్టమ్స్‌తో సజ్జమై ఉంటాయి.

ఇది కూడా చదవండి...

Kakori Train Action: కాకోరి రైలు యాక్షన్ నేటితో100 ఏళ్లు..1925 లో ఆగస్టు 09 న ఏం జరిగింది...భారత స్వాతంత్ర్య పోరాటంలో దీని పాత్ర ఏంటి...?
Top 150 MCQs for AP High Court 1621 Jobs 2025 Exam (Set-2): సిలబస్ మరియు కరెంట్ అఫైర్స్ ఆధారంగా రూపొందించిన క్విజ్

పోటీపరీక్షలకు ఉపయోగపడే MCQs

1. INS ఉదయగిరి ఏ నగరంలోని షిప్‌యార్డులో నిర్మించబడింది?
a) కోల్‌కతా
b) ముంబై
c) విశాఖపట్నం
d) చెన్నై
సమాధానం: b) ముంబై

2. INS హిమగిరి నిర్మించిన సంస్థ ఏది?
a) మజ్‌గావ్‌ డాక్‌ షిప్‌బిల్డర్స్‌ లిమిటెడ్‌ (MDL)
b) కోచిన్‌ షిప్‌యార్డ్
c) గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (GRSE)
d) లార్సెన్ & టుబ్రో
సమాధానం: c) గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజినీర్స్‌ (GRSE)

3. INS హిమగిరి,  INS ఉదయగిరి యుద్ధనౌకలు ఏ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించబడ్డాయి?
a) ప్రాజెక్ట్–15B
b) ప్రాజెక్ట్–17
c) ప్రాజెక్ట్–28
d) ప్రాజెక్ట్–75
సమాధానం: b) ప్రాజెక్ట్–17

4. INS ఉదయగిరి నేవీ వార్‌షిప్‌ డిజైన్‌ బ్యూరో రూపొందించిన ఎన్నవ నౌక?
a) 50వ
b) 75వ
c) 100వ
d) 125వ
సమాధానం: c) 100వ

5. INS హిమగిరి,  INS ఉదయగిరి యుద్ధనౌకల బరువు సుమారు ఎంత?
a) 4,500 టన్నులు
b) 6,700 టన్నులు
c) 8,200 టన్నులు
d) 10,000 టన్నులు
సమాధానం: b) 6,700 టన్నులు

6. INS హిమగిరి,  INS ఉదయగిరి యుద్ధనౌకల్లో ఏ రకం క్షిపణులు ఉన్నాయి?
a) సూపర్‌సోనిక్ సర్ఫేస్‌–టు–సర్ఫేస్‌
b) సర్ఫేస్‌–టు–ఎయిర్‌
c) యాంటీ–సబ్‌మెరైన్‌ వెపన్‌ సిస్టమ్స్‌
d) పైవన్నీ
సమాధానం: d) పైవన్నీ

☛ Follow our YouTube Channel (Click Here)

☛ Follow our Instagram Page (Click Here)

☛ Join our WhatsApp Channel (Click Here)

☛ Join our Telegram Channel (Click Here)

Published date : 11 Aug 2025 11:03AM

Photo Stories