టీఎస్–సీపీజీఈటీ–2021 మొదటి విడత కౌన్సెలింగ్లో వివిధ పీజీ కోర్సుల్లో సీట్లు సాధించిన విద్యార్థులు డిసెంబర్ 15 వరకు రిపోర్టింగ్ చేసుకోవచ్చని కన్వీనర్ పాండురంగారెడ్డి డిసెంబర్ 10న తెలిపారు.
పీజీ రిపోర్టింగ్ గడువు పెంపు
రిపోర్టింగ్ గడువు 10వ తేదీతో ముగియగా విద్యార్థుల విజ్ఞప్తి మేరకు పొడిగించినట్లు చెప్పారు. కాగా, డిసెంబర్ 10 నాటికి పీజీ కోర్సుల్లో సీటు సాధించిన 15 వేల మంది విద్యార్థులు రిపోర్టింగ్ చేసినట్లు కన్వీనర్ పేర్కొన్నారు.