Tennis: ఐటీఎఫ్ మహిళల టోర్నిలో డబుల్స్ టైటిల్ సాధించిన జోడీ?
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయి సామ సాత్విక డబుల్స్ టైటిల్ సాధించింది. మహారాష్ట్రలోని సోలాపూర్‌లో డిసెంబర్ 11న జరిగిన డబుల్స్ ఫైనల్లో సాత్విక–రమ్య నటరాజన్ (భారత్) ద్వయం 6–3, 1–6, 13–11తో ‘సూపర్ టైబ్రేక్’లో టాప్ సీడ్ సౌజన్య బవిశెట్టి–షర్మదా (భారత్) జోడీపై విజయం సాధించింది. సాత్విక కెరీర్‌లో ఇది రెండో ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్. 2019లో మెహక్ జైన్‌తో కలిసి సాత్విక నైరోబి ఓపెన్‌లో తొలిసారి ఐటీఎఫ్ డబుల్స్ టైటిల్ గెలిచింది.
ఆసియా రోయింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన క్రీడాకారుడు?
థాయ్‌లాండ్‌లోని బాన్ చాంగ్‌లో జరిగిన ఆసియా రోయింగ్ చాంపియన్‌షిప్‌లో డిసెంబర్ 11న భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. పురుషుల డబుల్స్ స్కల్స్ ఈవెంట్ రేసును అర్జున్ లాల్–రవి జంట అందరికంటే ముందుగా 6 నిమిషాల 57.883 సెకన్లలో పూర్తి చేసి పసిడి పతకాన్ని గెలిచింది. పురుషుల సింగిల్ స్కల్స్ విభాగంలో భారత రోయర్ పర్మీందర్ సింగ్ రజతాన్ని సాధించాడు.
చదవండి: కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన వెయిట్‌లిఫ్టర్?
క్విక్ రివ్యూ :
ఏమిటి : అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) మహిళల టోర్నమెంట్‌లో డబుల్స్ టైటిల్ సాధించిన జోడీ?
ఎప్పుడు : డిసెంబర్ 11
ఎవరు : సామ సాత్విక–రమ్య నటరాజన్ (భారత్) ద్వయం
ఎక్కడ : సోలాపూర్, మహారాష్ట్ర
ఎందుకు : ఫైనల్లో సాత్విక–రమ్య నటరాజన్ (భారత్) ద్వయం.. టాప్ సీడ్ సౌజన్య బవిశెట్టి–షర్మదా (భారత్) జోడీపై విజయం సాధించినందున..
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్