Skip to main content

Gymnastics: భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ ప్రణతి సరికొత్త రికార్డు

Gymnastics: ఆసియా ఆర్టిస్టిక్‌లో కాంస్యం గెలిచిన భారత స్టార్‌ జిమ్నాస్ట్‌?
Pranati Nayak wins bronze medal at Asian Gymnastics Championships 2022
Pranati Nayak wins bronze medal at Asian Gymnastics Championships 2022

భారత స్టార్‌ జిమ్నాస్ట్‌ ప్రణతి నాయక్‌ సరికొత్త రికార్డు నమోదు చేసింది. ఆసియా ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ ఛాంపియన్‌ షిప్స్‌ వాల్ట్‌ విభాగంలో కాంస్యం గెలిచిన ఆమె.. ఈ పోటీల చరిత్రలో రెండు పతకాలు నెగ్గిన ఏకైక భారత జిమ్నాస్ట్‌గా నిలిచింది. గతేడాది టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడ్డ 27ఏళ్ల ప్రణతి.. తన జోరు కొనసాగించింది. తాజాగా ఆసియా ఛాంపియన్‌ షిప్స్‌ వాల్ట్‌లో తొలి ప్రయత్నంలో 13.400, రెండో ప్రయత్నంలో 13.367 పాయింట్లు సాధించి... ఓవరాల్‌గా 13.367 స్కోరుతో మూడో స్థానాన్ని దక్కించుకొని కాంస్య పతకాన్ని గెలుచుకుంది. 

జావెలిన్‌ త్రో విజేత నీరజ్‌ చోప్రా 

neeraj chopra


ఒలింపిక్‌ ఛాంపియన్‌ నీరజ్‌ చోప్రా సూపర్‌ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. కోర్టానె గేమ్స్‌ జావెలిన్‌ త్రోలో అతడు స్వర్ణం గెలుచుకున్నాడు. 24 ఏళ్ల నీరజ్‌ తన తొలి ప్రయత్నంలో 86.69 మీటర్లు విసిరాడు. అదే అత్యుత్తమ త్రో అయింది. 
 

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 01 Jul 2022 05:32PM

Photo Stories