10/10 Wickets : భారత్‌పై ప్రపంచ రికార్డు సాధించిన కివీస్ స్పిన్నర్..అజాజ్ పటేల్
Sakshi Education
న్యూజిలాండ్ స్పిన్నర్ ఆజాజ్ పటేల్ టెస్ట్ క్రికెట్‌లో ప్రపంచ రికార్డు సాధించాడు.
భారత్‌తో జరిగిన రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన మూడో బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో 47 ఓవర్లు వేసిన ఆజాజ్ పటేల్ 119 పరుగులు ఇచ్చి 10 వికెట్లు సాధించాడు. అంతకు ముందు జిమ్ లేకర్, అనిల్ కుంబ్లే ఈ ఘనత సాధించారు.
1956లో ఇంగ్లండ్ బౌలర్ జిమ్ లేకర్ ఆస్ట్రేలియాపై పది వికెట్లు సాధించగా, 1999లో భారత స్పిన్నర్ అనిల్ కుంబ్లే పాకిస్తాన్‌పై 10 వికెట్లు పడగొట్టాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 325 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా బ్యాటర్లలో మయాంక్ అగర్వాల్ 150 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇక అజాజ్ ఘనతపై స్పందించిన అనిల్ కుంబ్లే.. ‘‘చాలా బాగా బౌలింగ్ చేశావు. వెల్‌కమ్ టూ క్లబ్’’ అంటూ స్వాగతం పలికాడు.
Published date : 04 Dec 2021 04:35PM