Skip to main content

Harmanpreet Singh: హర్మన్‌ ప్రీత్‌సింగ్‌కు ఎఫ్‌ఐహెచ్‌ అత్యున్నత పురస్కారం

Harmanpreet Singh named FIH Player of the Year

భారత అగ్రశ్రేణి హాకీ క్రీడాకారుడు హర్మన్‌ ప్రీత్‌ సింగ్‌ మరోసారి అంతర్జాతీయ హాకీ సమాఖ్య(ఎఫ్‌ఐహెచ్‌) అత్యున్నత పురస్కారం దక్కించుకున్నాడు. ఈ డిఫెండర్‌ పురుషుల విభాగంలో 'ఎఫ్‌ఐహెచ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌'గా వరుసగా రెండో ఏడాది ఎంపికయ్యాడు. 26 ఏళ్ల హర్మన్‌ ప్రీత్, టియున్‌ డి నూజెర్‌(నెదర్లాండ్స్‌), జేమీ డ్వైయర్‌(ఆస్ట్రేలియా), ఆర్థర్‌వాన్‌ డొరెన్‌ (బెల్జియం)ల తర్వాత వరుసగా రెండుసార్లు ఈ అవార్డును దక్కించుకున్న క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. హర్మన్‌ ప్రీత్‌కు ఓటింగ్‌లో అత్యధికంగా 29.4 పాయింట్లు రాగా.. బ్రింక్‌మన్‌ (నెదర్లాండ్స్‌), టామ్‌బూన్‌ (బెల్జియం) వరుసగా 23.6, 23.4 పాయింట్లు సాధించారు. 2021-22 హాకీ ప్రొ లీగ్‌ సీజన్లో హర్మన్‌ ప్రీత్‌ 16 మ్యాచ్‌లు ఆడి.. 18 గోల్స్‌చేశాడు. మహిళల్లో నెదర్లాండ్స్‌ క్రీడాకారిణి ఫెలిస్‌ ఆల్బర్స్‌ ఈ అవార్డును గెలుచుకుంది.

September Weekly Current Affairs (Sports) Bitbank: Which rule is expected to be introduced in IPL 2023?

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 21 Oct 2022 01:36PM

Photo Stories