FIH Rankings 2021: భారత హాకీ టీమ్‌కు మూడో ర్యాంక్
Sakshi Education
ప్రపంచ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ర్యాంకింగ్స్‌లో భారత్ అత్యుత్తమంగా మూడో ర్యాంక్‌తో ఈ ఏడాదిని ముగించనుంది.
డిసెంబర్ 23వ తేదీన ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో 2,296.038 పాయింట్లతో భారత్ మూడో ర్యాంక్‌ను కాపాడుకుంది. 41 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ భారత పురుషుల జట్టు ఈ ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించింది. ఎఫ్‌ఐహెచ్ ర్యాంకింగ్ పద్ధతిని ప్రవేశపెట్టాక భారత్ మూడో ర్యాంక్‌తో ఏడాదిని ముగించడం ఇదే తొలిసారి. డిసెంబర్ 22వ తేదీన ముగిసిన ఆసియా చాంపియన్స్ ట్రోఫీలో కాంస్య పతకాన్ని నెగ్గడంతో భారత్‌కు మూడో స్థానం ఖాయమైంది. 2642.25 పాయింట్లతో ఆ్రస్టేలియా అగ్రస్థానంలో నిలువగా... ఒలింపిక్ పసిడి పతక విజేత బెల్జియం రెండో స్థానాన్ని దక్కించుకుంది. మహిళల ర్యాంకింగ్స్‌లో భారత హాకీ జట్టు ఒక స్థానం పడిపోయి తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచింది.
Published date : 24 Dec 2021 05:58PM