‘గొల్లభామ’కు UNESCO గుర్తింపుపై హరీశ్‌రావు హర్షం
Sakshi Education
చేనేత కార్మికుల వృత్తి కళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే సిద్దిపేట బ్రాండ్ అంబాసిడర్ గొల్లభామ చీరకు యునెస్కో గుర్తింపు దక్కడంపై మంత్రి హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేశారు.
పదేళ్ల క్రితమే భౌగోళిక (జియోగ్రాఫికల్) గుర్తింపు లభించగా తాజాగా యునెస్కో గుర్తింపు రావడంతో మంత్రి హరీశ్‌రావు ట్విట్టర్ వేదికగా నేతన్నలను అభినందించారు. చీర ప్రత్యేకత, చరిత్ర గూర్చి వివరిస్తూ, వాటికి సంబంధించిన ఫొటోలను ట్యాగ్ చేశారు. ఇటీవల భారతీయ సంప్రదాయక వస్త్రాల సంరక్షణపై యునెస్కో విడుదల చేసిన నివేదికలో సిద్దిపేట గొల్లభామ చీరకు చోటు లభించింది. తలమీద చల్ల కుండ పెట్టుకుని, కుడి చేతిలో గురిగి(చిన్న మట్టి పాత్ర) పట్టుకొని, కాళ్లకు గజ్జెలు, కొప్పులో పువ్వులతో నడియాడే గొల్లభామ ప్రతిమలతో ఈ చీరను రూపొందిస్తారు.
Published date : 03 Oct 2022 08:28PM